శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లో చోరి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ రోడ్డు లోని సద్ధిమద్దుల సంఘం ప్రక్కన ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోకి దొంగలు బుధవారం రాత్రి ప్రవేశించి హుండి ని పగల గొట్టి నగదును ఎత్తుకెళ్లారు.

శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రతి రోజు స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు ఉదయం హుండీ ని గమనించిన సద్ది మద్దుల సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు.

సద్ది మధ్దుల సంఘం అధ్యక్షులు వంగ బాల్రెడ్డి ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆలయానికి వచ్చి హుండిని పరిశీలించి వెళ్లారు.ఆలయాలను టార్గెట్ చేసిన దొంగలు ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న పురాతన శివాలయం బాలాలయంలో గత వారం రోజుల క్రితం గుర్తుతెలియని దొంగలు చొరబడి చోరీకి విపల యత్నం చేశారు.

ఈ విషయాన్ని ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు మర్చిపోకముందే శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోని హుండీలోని నగదును దొంగలు అపహరించుక పోయారు.

ఈ సంఘటన తో ఆలయాలనే దొంగలు టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతుంది.

వైరల్ వీడియో: ఆఫ్రికాను తాకిన మంచు తుఫాను.. మంచులో ఎంజాయ్ చేస్తున్న సింహాలు..