థియేటర్ల ఓపెన్‌కు తొందరేం లేదంటున్న ఫిల్మ్‌ మేకర్స్‌

మొన్నటి వరకు థియేటర్లు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అంటూ ఎదురు చూసిన ఫిల్మ్‌ మేకర్స్‌ మరియు ప్రేక్షకులు ఇప్పుడు మాత్రం కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అంటున్నారు.

కరోనా కేసుల సంఖ్య వేలల్లో ఉంటున్న సమయంలో థియేటర్లు ఓపెన్‌ చేయడం ఏమాత్రం శ్రేయష్కరం కాదంటూ సామాన్య జనాలు అంటూ ఉండగా సినీ వర్గాల వారు కూడా ఇప్పుడు థియేటర్లు ఓపెన్‌ చేస్తే వచ్చే వారు ఎవరు ఉండరు.

కనుక థియేటర్లు ఓపెన్‌ చేయకుండా ఉంటేనే ఉత్తమం అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు.ఇటీవల సురేష్‌బాబు మాట్లాడుతూ సినిమాల షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత రెండు నెలల వరకు థియేటర్లను క్లోజ్‌ చేసి ఉంచడం బెటర్‌ అన్నాడు.

చైనాలో ఆమద్య లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లను ఓపెన్‌ చేయగా వారం రోజుల పాటు బాగానే ప్రేక్షకులు వచ్చినా ఆ తర్వాత కనిపించలేదు.

అలాగే విడుదలకు సినిమాలు కూడా ఏమీ లేవని థియేటర్లను మళ్లీ మూసేశారు అన్నాడు.

అలాంటి పరిస్థితి ఇండియాలో ఏర్పడకున్నా కూడా కరోనా కేసులు మాత్రం విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న కారణంగా థియేటర్లు ఓపెన్‌ చేస్తే ఏంటీ క్లోజ్‌ చేస్తే ఏంటీ అనేది మరికొందరి వాదన.

మొత్తానికి ఈ విషయంలో ప్రస్తుతం కాకున్నా రాబోయే నెల రోజుల్లో అయినా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు వరకు థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

కాని సినీ జనాలు మాత్రం దసరా సీజన్‌ వరకు క్లోజ్‌ ఉన్నా పర్వాలేదు అంటున్నారట.