నైట్ కర్ఫ్యూ ఎత్తి వేసిన తర్వాతే థియేటర్లు ఓపెన్
TeluguStop.com
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే కరెక్ట్ సమాధానం మాత్రం లభించడం లేదు.
థియేటర్ల రీ ఓపెన్ అనేది తెలుగు రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అంటున్నారు.
ప్రత్యేకంగా థియేటర్లను మూసి వేయాల్సిందిగా ప్రభుత్వాలు ఏమీ నోటీసులు ఇవ్వడం కాని ఆంక్షలు పెట్టడం కాని చేయలేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా సినిమా థియేటర్లను ఓపెన్ చేసినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి అభ్యంతరం ఉండక పోవచ్చు.
కాని సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పర్మీషన్.కనుక థియేటర్లు ఓపెన్ కు ప్రస్తుతం అనుకూల పరిస్థితులు అయితే లేవు అంటున్నారు.
నైట్ కర్ఫ్యూ ఉన్న సమయంలో థియేటర్లను రీ ఓపెన్ చేయడం దాదాపు సాధ్యం అంటూ తాజాగా ఏషియన్ సినిమాస్ అధినేత పేర్కొన్నాడు.
ఎప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు కుదుట పడుతాయో అప్పటికి థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని ఆయన తెలియజేశాడు.
ఈ సమయంలో థియేటర్లు రెండు షో లతో ఓపెన్ చేసినా కూడా 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే అవకాశం ఉంటుంది.
రెండు షో లు మరియు 50 శాతం ఆక్యుపెన్సీ అంటే థియేటర్ల యాజమాన్యాలపై భారీ గా భారం పడుతుందని అందుకే నాలుగు షో లకు అనుకూలమైన సమయం లోనే థియేటర్లను పునః ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం థియేటర్లు మరియు మాల్స్ పూర్తి స్థాయిలో నడవడం లేదు. """/"/ ఎప్పటి వరకు థియేటర్లు మరియు మాల్స్ పూర్తి స్థాయిలో రన్ అవ్వబోతున్నాయి అనేది క్లారిటీ లేదు.
నైట్ కర్ఫ్యూ వల్ల థియేటర్లు రెండు షో లను మాత్రమే వేసే అవకాశం ఉంటుంది కనుక సినిమా లు విడుదల చేయడానికి కూడా మేకర్స్ ముందుక వచ్చే అవకాశం లేదు.
ఈ నెల చివరి వరకు థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అంటే ప్రభుత్వాలు ఆంక్షలు పూర్తి గా ఎత్తి వేస్తారు అనేది కొందరి నమ్మకం.
మరి ఏం జరుగుతుందో చూడాలి.
ప్రియుడు విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిన తమన్నా… సోషల్ మీడియా ఫోటోలు డిలీట్?