జనవరి 1న సినిమా చూద్దామని వెళ్లిన ప్రేక్షకులకి షాకిచ్చిన థియేటర్ల యాజమాన్యాలు!
TeluguStop.com
జీఎస్‌టీ.2017 జూలై 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
తాజాగా రూ.100పైన సినిమా టికెట్లపై 28% జీఎస్టీని 18 శాతానికి; వందలోపు టికెట్లపై 18% జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు.
జనవరి ఒకటి, 2019 నుంచి కొత్త జీఎస్టీ అమలులోకి వస్తుందని మంత్రి చెప్పారు.
కానీ ఆ జనవరి ఒకటి వచ్చేసింది.అయినప్పటికీ కొత్త పన్ను ఆచరణలోకి రాలేదు.
పైగా ఎవరు పట్టించుకోలేదు కూడా. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
గతంలో ఉన్న పాత ధరలనే వసూలు చేస్తున్నారు థియేటర్ యాజమాన్యాలు.
కేంద్ర నిర్ణయంతో టికెట్ ధర తగ్గుతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా సుమారు 60 సినిమా థియేటర్లు ఉండగా జిల్లా కేంద్రంలో 9 ఉన్నాయి.
దాదాపు 50 శాతం పైగా థియేటర్లలో రూ.100కు మించి టికెట్ ధర వసూలు చేస్తున్నారు.
ఇలా వసూలు చేసిన టికెట్లపై 18 నుంచి 12 శాతం జీఎస్టీ తగ్గింది.
అంటే 6 శాతం జీఎస్టీ తగ్గాల్సి ఉన్నా థియేటర్ల యాజమాన్యాలు అమలు చేయకపోవడం దారుణమని ప్రేక్షకులు అంటున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
రాజాం, పాలకొండ, పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట పట్టణాల్లోని థియేటర్లలోనూ ధర తగ్గింపునకు నోచుకోలేదు.
ఇప్పటికైనా జీఎస్టీ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి కేంద్ర నిర్ణయాన్ని అమలు చేసి ప్రేక్షకులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రేక్షకులు కోరుతు న్నారు.
నైజాం లో భారీ లాభాలను తెచ్చిపెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం…