14 ఏళ్లకే 2 డాక్టరేట్లు సంపాదించిన పిన్న వయస్కురాలు!

వింటే ఆశ్చర్యంగా వుంది కదూ.బేసిగ్గా మనలో అనేకమంది ఒక మామ్మూలు డిగ్రీ పట్టా తీసుకోవడానికే నానా తిప్పలు పడుతూ వుంటారు.

అలాంటిది ఆమె ఏకంగా రెండు గౌరవ డాక్టరేట్ పట్టాలు పొందింది.పైగా ఆమె వయసు 14 సంవత్సరాలు మాత్రమే.

ఇంత తక్కువ వయస్సులో ఆమెకెలా సాధ్య పడిందో తెలియాలంటే ఈ కథ మీరు చదవాల్సిందే.

మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గీత్‌ పత్ని అనే యువతి 14 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోని 2 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ను సంపాదించింది.

ఆమె "ఫోన్‌ ఎక్కువగా వాడటం వలన పిల్లలపై పడే ప్రభావాలు" అనే అంశంపై పరిశోధన చేసింది.

దానికి గాను ఈ డాక్టరేట్‌లు ఆమెని వరించాయి.దాంతో ఆమె ఏకకాలంలో రెండు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్‌ పొందిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది.

ఈ విషయమై ఓ మీడియా వేదికగా ఆమె తల్లిదండ్రులు మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేసారు.

తమకి ఎంతో గర్వంగా వుందని, తమ బిడ్డ అందరిలాగా కాకుండా భిన్నంగా ఆలోచిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు.

"""/"/ ఇకపోతే గీత్‌ పత్ని ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది.చదువుతోపాటు ఆమె యోగాలో మాస్టర్స్‌ పూర్తి చేసి, అనేక మందికి శిక్షణ ఇస్తోంది.

లాక్‌డౌన్‌ సమయంలో పిల్లల్లో ఫోన్‌ వాడకం మితిమీరడంతో వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతున్న విషయాన్ని గీత్‌ పత్ని గ్రహించి, దానిపై పలు పరిశోధనలు చేసింది.

ఈ క్రమంలో ఈ అంశంపై పరిశోధన పత్రాన్ని రూపొందించి ప్రపంచంలోని 7 ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు పంపించింది.

ఈ పత్రాలను పరిశీలించిన కొలంబియా, ఘనా విశ్వవిద్యాలయాలు.గీత్‌కు డాక్టరేట్‌ను ప్రకటించాయి.

బేబమ్మ చీరలో కేక పెట్టిస్తోన్న అందాలు.. కృతి శెట్టి గ్లామర్ షో