కొత్త వైట్ సాక్స్ ధరించి జపాన్ వీధుల్లో నడిచిన యువతి.. కట్ చేస్తే..?

జపాన్ దేశం(Japan) ఎంత క్లీన్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రముఖ ట్రావెల్, బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సిమ్రాన్ బలార్ జైన్ ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది.

తన రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)రీల్‌లో ఆమె జపాన్ వీధుల్లో వైట్ సాక్సులతో నడిచింది.

అయితే, ఆమె సాక్సులకు కొంచెం కూడా మురికి అంటలేదు.అవును, ఆమె కేవలం సాక్స్‌లు మాత్రమే ధరించి నడిచినా అవి మురికి కాలేదు.

విదేశీ నగరాల వీధులు చాలా మురికిగా ఉంటాయనే భావన ప్రజల్లో ఉంటుంది.కానీ సిమ్రాన్ బలార్ జైన్ మాత్రం జపాన్ దేశంలో దీన్ని ప్రయత్నించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆమె అనుభవం ఎంతో మందిలో కొత్త చర్చను రేకెత్తిస్తోంది.వైరల్ ఇన్‌స్టా రీల్‌లో సిమ్రాన్ బలార్(Simran Balar) జపాన్‌లోని ఒక దుకాణంలో తెల్లని సాక్స్‌లు కొనుగోలు చేసినట్లు చూడవచ్చు.

అవి ధరించి ఆమె వీధుల్లో నడవడం ప్రారంభించింది.తన బూట్లు చేతిలో పట్టుకుని, ఫుట్‌పాత్‌లు, క్రాస్ రోడ్లు అని చూడకుండా నడిచి తన ప్రయాణాన్ని రికార్డ్ చేశారు.

చాలా మంది ప్రేక్షకులు ఆమె సాక్స్‌లు మురికిగా మారతాయని అనుకున్నారు.కానీ ఆమె తన సాక్స్‌లు చూపించినప్పుడు అవి చాలా క్లీన్ గా ఉండటంతో అందరూ షాక్ అయ్యారు.

అవి ఆమె కొత్తగా ధరించినప్పుడు ఉన్నంత శుభ్రంగానే ఉన్నాయి. """/" / సిమ్రాన్ చేసిన ఈ వీడియోకి నెటిజన్ల నుంచి వచ్చిన స్పందనలు మిశ్రమంగా ఉన్నాయి.

కొంతమంది జపాన్‌లోని(Japan) పరిశుభ్రతను మెచ్చుకుంటూ సిమ్రాన్‌తో ఏకీభవించారు."నేను ఇప్పుడు టోక్యోలో ఉన్నాను, మీరు చెప్పింది నిజమే.

ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది.ఎవరూ చెత్త వేయరు" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

"""/" / మరొకరు, "నేను గత నెలలో వెళ్ళాను, జపాన్ నిజంగా చాలా శుభ్రంగా ఉంది" అని అన్నారు.

అయితే, అందరూ ఈ విషయాన్ని నమ్మలేదు.కొంతమంది ఈ వీడియో నకిలీ అని అనుమానించారు.

"జపాన్ శుభ్రంగా ఉంటుందని నేను నమ్ముతాను కానీ, తెల్లని సాక్స్‌లు అంత శుభ్రంగా ఉండటం కష్టం" అని ఒకరు రాశారు.

మరికొందరు, "మీరు సాక్స్‌లు వేసుకున్న చోటే వీడియో తీశారు, ఎక్కడికీ నడవలేదు" అని అన్నారు.

ఈ చర్చ ఎలా ఉన్నా, ఈ వీడియో జపాన్‌లోని పరిశుభ్రత గురించి ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఆఫ్రికాలో భారతీయ ట్రావెల్ వ్లాగర్‌కు ఊహించని షాక్.. ఏం జరిగిందో మీరే చూడండి..