శ్రీ మహా విష్ణువు ను సంప్రదాయంగా పెళ్లి చేసుకున్న యువతి ఎందుకంటే..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతి యువకులు పెళ్లి వయసు వచ్చిన తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే.

నేటి సమాజంలోని యువతి యువకులలో పెళ్లి అంటే అ ఇష్టంగా మారిపోయింది.ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో వివాహితులకు సరైన రక్షణ లేకుండా పోయింది.

అంతేకాకుండా సమాజంలో పెళ్లి కానీ యువతి అంటే చిన్న చూపుగా మారిపోయింది.అంతేకాకుండా తెలిసినవారు, తెలియని వారు కూడా పెళ్లి కానీ యువతులకు పెళ్లి చేసుకోమని ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు.

ఇలాంటి సలహాలకు విసుగు చెందిన ఒక యువతి వివాహ ఒత్తిడికి లొంగిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

అయితే ఇక్కడే ఆ యువతి అందరికీ ఒక రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చింది.

తను పెళ్లి చేసుకునే వరుడు విష్ణు భగవంతుడు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

ఈ వింత ఘటన రాజస్థాన్లో జరిగింది.డిసెంబర్ 8న జైపూర్ లోని గోవింద్ ఘాడ్ కు సమీపంలోని గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

రాజస్థాన్ కు చెందిన 30 ఏళ్ల పూజాసింగ్ హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గణేష్ పూజ సప్తపది అగ్నిసాక్షితో వివాహం చేసుకుంది.

అయితే ఆమె పెళ్లిలో వరుడు లేడు.వధువు పూజా సింగ్ శ్రీమహావిష్ణువు భక్తురాలు తను దేవునితో ముడి పడాలని నిర్ణయం తీసుకుంది.

పూజ సింగ్ చేసుకున్న వివాహానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తున్నాయి.

పసుపు రంగు దుస్తులు ధరించిన మహిళ ఎంతో సంతోషంగా ఉంది.మానవుడిని కాకుండా దేవుడిని పెళ్లి చేసుకోవడం మామూలు విషయం కాదని అందరూ చెబుతున్నారు.

"""/"/ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడిగితే తన తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధాన్ని చూసి తను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సింగ్ చెప్పింది.

పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని నమ్మి తను జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంది.

శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకున్న పూజా సింగ్ దేవాలయంలో విష్ణు కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తూ ఉంది.

తన జీవితం శ్రీమహావిష్ణు కే అంకితం అని చెబుతోంది.

రుచిగా ఉంటుందని రోజూ కోల్డ్ కాఫీ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!