Rotor Brake Lever : వీడియో: హెలికాప్టర్ బ్రేక్ లివర్ పట్టుకున్న యువతి.. షాకైన పైలట్.. చివరికి..?

తాజాగా అమెరికాలో ఓ హెలికాప్టర్ పైలట్‌కు షాకింగ్ అనుభవం ఎదురయింది.గ్రాండ్ కాన్యన్ మీదుగా గాలిలో విహరిస్తున్న సమయంలో, ఒక ప్యాసింజర్ హెలికాప్టర్ కంట్రోల్ లివర్‌ను పట్టుకుంది.

దానివల్ల ప్రమాదకరమైన రీతిలో హెలికాప్టర్ కదలిక మారింది.ఈ లివర్ హెలికాప్టర్( Lever Helicopter ) లో చాలా కీలకమైనది.

ఎందుకంటే దీనిని హెలికాప్టర్ ప్రధాన రోటర్ బ్లేడ్లు నేలపై ఉన్నప్పుడు తిరగకుండా ఆపడానికి ఉపయోగిస్తారు.

దీనిని రోటర్ బ్రేక్ లివర్( Rotor Brake Lever ) అంటారు.

హెలికాప్టర్ గాలిలో ఉన్నప్పుడు ఎవరైనా ఈ లివర్‌ను లాగితే, అది వినాశకరమైన పరిణామాలను కలిగిస్తుంది.

"""/" / ప్రమాదాన్ని గ్రహించిన పైలట్ వెంటనే స్పందించి లివర్‌ని లాగకుండా ప్యాసింజర్‌ను అడ్డుకున్నాడు.

పైలట్ క్విక్ థింకింగ్, యాక్షన్ కారణంగా విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఈ ఘటన వీడియోలో రికార్డయింది.దాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన సమయం నుంచి వైరల్‌గా మారింది, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు దీన్ని వీక్షించారు.

లివర్ పట్టుకున్న యువతి ముందు సీటులో, పైలట్ పక్కన కూర్చుతుంది.ఈ సీటును కో-పైలట్ సీటు అని పిలుస్తారు.

ఈ సీటు సాధారణంగా పైలట్‌కు సహాయం చేయగల ట్రైన్డ్‌ పైలట్ కోసం కేటాయిస్తారు.

మరి ఈ హెలికాప్టర్‌లో ప్రయాణికుడిని అక్కడ ఎందుకు కూర్చోబెట్టారనేది స్పష్టంగా తెలియ రాలేదు, వీడియోను చూసిన చాలా మంది ప్రేక్షకులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు.

"""/" / ఈ వీడియోను నెదర్లాండ్స్‌కు చెందిన 27 ఏళ్ల టూరిస్ట్ చెర్లిన్ బిజ్‌ల్స్మా ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.

చెర్లిన్ యునైటెడ్ స్టేట్స్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.పై నుండి గ్రాండ్ కాన్యన్‌ను చూడటానికి హెలికాప్టర్ పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ ఘటన కారణంగా టూర్ ఊహించిన దానికంటే ఎక్కువ భయానకంగా మారింది.ఈ సంఘటన వీడియో చూసిన కొందరు హెలికాప్టర్‌ను వెంటనే ల్యాండింగ్ ప్యాడ్‌కు తిరిగి తీసుకురావడం సరైన నిర్ణయం అలాంటి ప్రయాణికులను వెంటనే దించేయాలి అని అన్నారు.

ఎయిర్‌లైన్ అధికారి, ది న్యూయార్క్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లివర్ పనితీరును వివరించారు.

హెలికాప్టర్ సురక్షితంగా నేలపై ఉన్నప్పుడు మాత్రమే దానిని ఉపయోగించాలని నొక్కి చెప్పారు.గాల్లో ఉన్నప్పుడు దాన్ని వాడితే చనిపోయే ప్రమాదం ఎక్కువ అని హెచ్చరించారు.

చరణ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ఫిక్స్.. అలా ఉండబోతుందా?