సింహం ప్లేట్‌లోని ఫుడ్ తిన్న యువతి.. అది చూసిన లయన్ ఏం చేసిందంటే?

సాధారణంగా జంతువులు తినేటప్పుడు వాటి దగ్గర నుంచి ఫుడ్డు లాగేస్తే అవి దాడి చేస్తాయి.

కుక్కలైనా పిల్లలు అయినా ఇంకా ఏ మాంసాహార జంతువులైనా సరే వాటి నుంచి ఫుడ్ ను షేర్ చేసుకోలేం.

ఇలా చేస్తే పెంపుడు జంతువులు కూడా కోపానికి గురవుతాయి.ఇక సింహం పులి వంటి కూర మృగాల దగ్గర ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదు.

అయితే తాజాగా ఒక యువతి తన పెంపుడు సింహంతో ఈ స్టంట్‌ను ధైర్యంగా చేసింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. """/" / యూఏఈ( UAE )లోని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఈ వీడియో తీశారు.

వీడియోలో, సదరు యువతి సింహం ఒక ప్లేట్ నుంచి తింటుంది.మహిళ ప్రశాంతంగా అదే ప్లేట్ నుండి సింహంతో కలిసి తింటుంది.

ఆమె అస్సలు భయపడటం లేదు.సాధారణంగా సింహం తమ కోసమని పెట్టిన ఫుడ్ వేరే వారు తింటే చాలా కోప్పడతాయి పెంపుడు జంతువులైనా సింహాలు ఎప్పుడు ఎలా ఉంటాయి అసలు చెప్పలేం.

అవి పెంచి పోషించిన యజమానులపై దాడి చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు """/" / జూకి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్( Instagram) పేజీ "ఇలాంటివి అక్కడ మాత్రమే జరుగుతాయి" అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేసింది.

చాలా మంది ఈ వీడియోను చూశారు.లైక్ చేసారు, అయితే కొంతమంది ఆ మహిళ కౄర జంతువుతో సన్నిహితంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

"సింహాలు( Lions) పెంపుడు జంతువులు కావు.భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఉన్నందున ఇది ప్రమాదకరమ"ని వారు అంటున్నారు.

మరి కొందరు మాత్రమే ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.అడవి జంతువులతో ఇటువంటి సాహసోపేతమైన పనులు చేయడం సురక్షితం కాదు, ఎందుకంటే అవి, ప్రజలకు హాని కలిగించవచ్చు.

సురక్షితమైన దూరం నుంచి మాత్రమే వాటిని పెంచడం మంచిది.

వైరల్ వీడియో: ఏంటి భయ్యా కోతి ఇలాంటి పనులు చేస్తోంది