జగన్ నో అన్నారా .. జనసేన ఉందిగా ?

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ మేరకు అన్ని పార్టీల నేతలు ఎన్నికల మూడ్ లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

పాదయాత్రలు, బస్సు యాత్రలు, బీసీ సభలు, జనాల సమస్యలు అంటూ సభలు,  సమావేశాలు నిర్వహిస్తూ, ఏపీలో ఎన్నికల వాతావరణాన్ని అప్పుడే చూపించేస్తున్నారు.

జనసేన, బిజెపి, వైసిపి, టిడిపి ఇలా అంతా 2024 ఎన్నికల్లో గెలుపు పైనే పూర్తిగా దృష్టిపెట్టారు.

ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిగా విషయంలో ఒక క్లారిటీకి వస్తున్నారు.

ఈ విషయంలో అధికార పార్టీ వైసీపీ మరింత దూకుడుగా ఉంది.151 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు.

ఇప్పుడు వారిలో పనితీరు సక్రమంగా లేనివారికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయానికి జగన్ వచ్చేశారు.

ఇప్పటికే ఆ తరహా వైసిపి ఎమ్మెల్యేలకు వార్మింగులు కూడా ఇచ్చారు.పనితీరు మార్చుకుంటేనే టికెట్ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఈరోజు మరోసారి సమావేశం జరగబోతోంది.  ఈ సమావేశంలోనే వారి వివరాలను జగన్ ప్రకటించబోతున్నారు.

దీంతో వైసీపీలో ఒక స్థాయిలో అలజడే రేగే అవకాశం కనిపిస్తోంది.టికెట్ దక్కే అవకాశం లేదనుకున్నవారు, పార్టీని అంటిపెట్టుకుని పార్టీ విజయానికి కృషి చేస్తారా అంటే అది సందేహమే.

తమకు టికెట్ దక్కదని తెలిసిన మరుక్షణమే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో ఉంటారు అనడంలో సందేహం లేదు.

ఈ నేపథ్యంలోనే వారికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు జనసేన కనిపిస్తోంది.వైసిపి వర్గాల లెక్కల ప్రకారం దాదాపు 50-60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే వారు జనసేన వైపు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి.

"""/"/ గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ ఈ మధ్యకాలంలో పెరగడం,  కొత్త పార్టీకి అవకాశం ఇస్తే తప్పేంటి అన్న అభిప్రాయం ప్రజల్లో ఇప్పుడిప్పుడే కలుగుతుండడంతో,  తమకు టిక్కెట్ దక్కని పక్షంలో జనసేన వైపు వెళ్లాలని చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారట.

టిడిపిలోను ప్రాధాన్యం దక్కని వారు జనసేన వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అంతే కాకుండా, జనసేన సైతం వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది తమ పార్టీలో చేరుతారని ఆశలు పెట్టుకుంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా నియోజకవర్గాల్లో తమ బలం పెరుగుతుందని,  వారికి టిక్కెట్ కేటాయిస్తే అంగ బలం ఉంటుందని, ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టుండడం, పరిచయాలు ,ఇవన్నీ తమకు కలిసి వస్తాయని జనసేన లెక్కలు వేసుకుంటోందట.