జనసేన నేతపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం

ఎలాగైనా 2024 ఎన్నికల్లో గెలవాలని వైసీపీ పట్టుదలతో కనిపిస్తోంది.ఇప్పటికే బీజేపీతో రహస్యంగా చేతులు కలిపింది.

తద్వారా కేంద్రం నుంచి రాబట్టాల్సిన వాటిని ఆ పార్టీ పక్కన పెట్టేసింది.22 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వాళ్లు సాధించింది శూన్యమని అందరూ భావిస్తున్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యర్థులను నామరూపాల్లేకుండా చేయాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతల్లో బలమైన నేతలపై దృష్టి పెట్టారు.

ముఖ్యంగా జనసేన పార్టీ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించిందని ప్రచారం జరుగుతోంది.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కీలక నేతగా ఉన్న కందుల దుర్గేష్‌ను ఆ పార్టీ టార్గెట్ చేసింది.

ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.

2014లోనూ బుచ్చయ్య చౌదరే గెలుపొందారు.అయితే 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన కందుల దుర్గేష్ 42 వేలకు పైగా ఓట్లు సాధించారు.

అంటే దాదాపు 23 శాతం ఓట్లు కందుల దుర్గేష్ సాధించారు.ప్రస్తుతం కందుల దుర్గేష్ జనసేన పార్టీలో టాప్-3 నాయకుల్లో ఒకడిగా ఉన్నారు.

అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.మరోవైపు గత రెండు సార్లు అంటే 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆకుల వీర్రాజు రాజమండ్రి రూరల్‌లో ఓడిపోయారు.

ఇటీవల ఆయన క్రియాశీలకంగా పనిచేయడం లేదని టాక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కందుల దుర్గేష్‌పై కన్నేసింది.

"""/"/ కందుల దుర్గేష్‌ వైసీపీలోకి వస్తే నియోజకవర్గ ఇంఛార్జిగా ప్రకటించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.

ఎన్నికల్లో ఖర్చు మొత్తం కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్టు కాపు నేతలు చర్చించుకుంటున్నారు.

అయితే వైసీపీ ఆఫర్‌ను కందుల దుర్గేష్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.తన ప్రయాణం జనసేనతోనే జరుగుతుందని స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టే ఆలోగా కందుల దుర్గేష్ మనసు మార్చుకుంటారని.

ఆయన రాకపోతే మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ కుమారుడు చందన నాగేశ్వరరావును బరిలోకి దించాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.

తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్లతో నటించిన స్టార్ హీరో ఈయన ఒక్కడేనా..?