టీడీపీ సోషల్ మీడియా అస్త్రం ! వైసీపీ విలవిల్లాడుతోందిగా  ?

2019 ఎన్నికలకు ముందు వైసిపి అప్పటి అధికార పార్టీ టిడిపి పై ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేకత పెంచిందో సరిగ్గా ఇప్పుడు అదే అస్త్రాన్ని వైసిపి తెలుగుదేశం పార్టీ పై ప్రయోగిస్తోంది.

2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ తరఫున రాజకీయ వ్యూహకర్త గా ప్రశాంత్ కిషోర్ పని చేశారు .

అప్పట్లో  తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న వ్యతిరేకత, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నాయకుల అవినీతి, అక్రమాలు ఇలా అన్నిటిని వైసీపీ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేసే విధంగా ప్రశాంత్ కిషోర్ తగిన సలహాలు అందించారు .

దీనికితోడు పార్టీని ఏదో విధంగా అధికారంలోకి తీసుకురావాలనే తపనతో ఉన్న వైసిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో అప్పటి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, నిర్ణయాలను టాబ్లెట్ చేసుకునే వారు.

వైసిపి 2019 ఎన్నికల్లో ఆ స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది అంటే దానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం కృషి కూడా చాలానే ఉంది.

     ఇక ఇప్పుడు తెలుగుదేశం సైతం అదే సోషల్ మీడియా అస్త్రాన్ని వైసీపీ పై ప్రయోగిస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు,  ప్రస్తుతం అమలవుతున్న హామీలు,  ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు , జగన్ పాలనపై జనాలు పెరుగుతున్న వ్యతిరేఖత,  ఏపీలో  పెరిగిపోతున్న వివిధ సమస్యలు,  ధరల పెరుగుదల, ఇలా అన్ని అంశాలను సోషల్ మీడియా వేదికగా టిడిపి శ్రేణులు టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం కు సంబంధించి ఏ చిన్న అంశం దొరికినా,  సోషల్ మీడియా వేదికగా దానిని వైరల్ చేస్తూ జనాల్లో వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేక భావం ఏర్పడే విధంగా చేస్తున్నారు.

  """/"/   ఇక పెద్ద ఎత్తున వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి వైసిపి వ్యతిరేక పోస్టులను వైరల్ చేస్తూ టిడిపి కి జనాల్లో ఆదరణ పెంచే విషయంపై తెలుగు తమ్ముళ్లు దృష్టి సారించారు.

ఇప్పటికే అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీకి టీడీపీ సోషల్ మీడియా విభాగం మరింత యాక్టీవ్ కావడం ఇబ్బందికరంగా మారింది.

   .

ఒక్క దెబ్బతో చుండ్రు మొత్తం పోవాలా.. అందుకు ఇదే బెస్ట్ రెమెడీ!