ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా.. బరువు ఏకంగా 2,800ల కిలోలు!
TeluguStop.com
కెమెరా ఇష్టపడనివారు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.ఎలాంటివారికైనా కొన్ని జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలని ఉంటుంది.
ఈ క్రమంలోనే మన నిత్యం వాడే సెల్ ఫోన్స్ కెమెరా అమర్చడం జరిగింది.
దాంతో మనకి నచ్చినప్పుడు క్లిక్ అనిపించొచ్చు.అయితే మీరు మార్కెట్లో రకరకాల కెమెరాలను చూసి వుంటారు.
అయితే ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ఒకటుందని మీలో ఎంతమందికి తెలుసు.వుంది, అది ఐదున్నర అడుగుల లెన్స్ కలిగి ఉందంటే మీరు ఊహించుకోండి.
అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది మరి.ఈ లెన్స్ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు అని టాక్.
ఈ డిజిటల్ కెమెరా కెపాసిటీ తెలిస్తే మీకు కళ్ళు బైర్లు కమ్మడం గ్యారంటీ.
3,200 మెగాపిక్సెల్ సామర్థ్యం ఇది కలిగి వుంది.రాత్రి సమయంలో ఖగోళ చిత్రాలను క్లారిటీగా తీయడం కోసం దీన్ని రూపొందించడం జరుగుతుంది.
ఇకపోతే దాదాపుగా పూర్తయిన ఈ కెమెరా ఫొటోలను తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
ఈ కెమెరాను వచ్చే ఏడాది చిలీలోని ఓ పర్వతంపై అమర్చనున్నారు.శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని కెమెరాను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
"""/"/
ఆకాశంలో జరిగే అద్భుతాలు, రహస్యాలను వెలికి తీయడం కోసం దీనిని వాడనున్నారు.
సాధారణంగా మనం దిగే ఫొటోలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో.కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనుండి ఈ కెమెరా ద్వారా తీసిన ఫొటోలు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ జంబో కెమెరా ప్రత్యేకతలు విషయానికొస్తే,
కెమెరా ముందుభాగంలో ఉండే అద్దం 27 అడుగులు ఉంటుంది.
అంటే టెన్నిస్ సింగిల్స్ కోర్టు ఎంత సైజులో ఉంటుందో అంత సైజు లెక్క వేసుకోవచ్చు.
3,200 మెగాపిక్సెల్, 189 సెన్సర్లు, 5 అడుగుల లెన్స్
2800 కిలోల బరువు కలిగి ఉంటుంది.
వీడియో: పాడుబడిన ఇంట్లో వెతుకుతుంటే ఊహించని ట్విస్ట్.. గోడల్లో నిధి చూసి షాక్!