మరొక అద్భుత లోకాన్ని సృష్టించిన దుబాయ్.. మెచ్చుకోకుండా ఉండలేరు !

దుబాయ్ అంటే ఇంతక ముందు ఎడారి గుర్తుకు వచ్చేది.కానీ అతి తక్కువ సమయంలోనే అధివృద్ది సాధించి అందరికి ఆదర్శంగా నిలిచారు.

ఈ దేశంలో ఇప్పటికే ఎన్నో ఆశ్చర్య పరిచే కట్టడాలు ఉన్నాయి.ఎడారిలో కూడా ఇంత అభివృద్ధి చేయగలరని ఎవ్వరు ఊహించలేదు.

అందరి అంచనాలను తల్లక్రిందులు చేసి ఈ దేశాన్ని అభివృద్ధి పరంగా ముందుకు నడిపారు.

తాజాగా దుబాయ్ లో మరొక అందమైన అద్భుత మైన లోకాన్ని సృష్టించారు.ఈ అందమైన లోకాన్ని చూసి మరొక లోకంలో ఉన్నట్టు అనిపించడం ఖాయం.

ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ ఫూల్ ను దుబాయ్ ఆవిష్కరించింది.ఇది సాదాసీదా గా ఉండే స్విమ్మింగ్ ఫూల్ కాదు.

ఇది ఒక అందమైన అద్బుతమైన లోకంగా దీనిని తీర్చి దిద్దారు.ఇందులో చాలా ప్రత్యేకతలు దాగి ఉన్నాయి.

""img Src=" "https://telugustop!--com/wp-content/uploads/2021/07/Dubai-deep-e-in-dubai-deep-e-dubai-water-pool-60-meters!--jpg/ డీప్ డైవ్ దుబాయ్ పేరుతొ అక్కడి ప్రభుత్వం ఈ స్విమ్మింగ్ ఫూల్ ను నిర్మించింది.

ఇది కొన్ని అంతస్థుల లోతు ఉంటుంది.ఇక్కడ స్విమ్ చేస్తూ బయట ప్రపంచాన్ని కూడా చూడడానికి అవకాశం ఉంది.

ఇంత లోతైన స్విమ్మింగ్ ఫూల్ ఇంత వరకు ఎక్కడ లేదు.అందుకే ఇది గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.

ఈ స్విమ్మింగ్ ఫూల్ ను దుబాయ్ యువరాజు హమ్ దన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించాడు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2021/07/Dubaibiggest-pool-Dubai-deep-e-in-dubai-deep-e-dubai-water-pool-60-meters!--jpg"/ ఈ స్విమ్మింగ్ ఫూల్ లోతు 60 మీటర్లు ఉంటుంది.

దీనిలో 1.4 కోట్ల లీటర్ల నీరు పడుతుంది.

ఇంత పెద్ద స్విమ్మింగ్ ఫూల్ ను శుభ్రపరచడానికి కూడా కష్టం కాబట్టి దీనికి నాసా రూపొందించిన ఫిల్టర్ టెక్నాలిజీ ను ఉపయోగిస్తున్నారు.

ఇందులో ఎన్నో అద్బుతమైన కళాఖండాలను చూడవచ్చు.ఒక్కో ఫ్లోర్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.

త్వరలోనే ఈ స్విమింగ్ ఫూల్ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి రానుంది.మీరు కూడా ఇక్కడ వీడియోలో ఈ అద్బుతమైన స్విమ్మింగ్ ఫూల్ ను చూడండి.

ఎలా ఉండే నయనతార ఎలా మారిపోయింది ? కారణం ఏంటి ?