మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత విభాగాల ఇంజనీర్లను ఆదేశించారు.

బుధవారం సాయంత్రం   జిల్లా కలెక్టర్ , జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి తో కలిసి మన ఊరు మనబడి కార్యక్రమం, స్వచ్చ సర్వే క్షన్, ఉపాధి హామీ పనుల ప్రగతి పై పలు ఇంజనీరింగ్ విభాగాల కార్యనిర్వహక ఇంజనీర్ లు, ఎంపిడివో లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 సర్వే లో అన్ని అంశాలలో మంచి స్కోర్ వచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో చేపట్టాలన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో ఎప్పటి కప్పుడు పురోగతి తో పాటు ఉపాధి కూలీల సంఖ్యను పెంచి ప్రతి జాబ్ కార్డుకు 100 రోజుల పని కల్పించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరుశాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.హరిత హారంలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీలో నాటిన మొక్కలను వం దశాతం మొక్కలు బతికేలా చూడాలని, నర్సరీల్లో ఉన్న మొక్కలకు నీటి సదుపాయం కల్పిం చాలని, మొక్కలు ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు.

"""/" / మన ఊరు మన బడి కార్యక్రమం కింద పనులు మంజూరై  ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించని వాటిని వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు .

పెండింగ్లో ఉన్న పనులను కూడా వేగిరం చేసి సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తయ్యేలా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఇంజనీర్లకు సూచించారు.

ఈ సమావేశంలో  జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీపీఓ రవీందర్, అదనపు డీఆర్డీఓ మదన్ మోహన్, ఐడిఎం మల్లిఖార్జున్ తదితరుల పాల్గొన్నారు.

సాగర తీరంలో విరాట్ కోహ్లీ సైకత శిల్పం.. హ్యాపీ బర్త్డే కోహ్లీ