అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు సకాలంలో పూర్తి చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా:అమ్మ ఆదర్శ పాఠశాలల( Amma Adarsha Patashala Committees ) కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మత్తు పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ( Collector Anurag Jayanthi )ఆదేశించారు.

తంగళ్లపల్లి మండలం మండేపల్లి, నేరెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ముస్తాబాద్ మండలం పోత్గల్, చీకోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద విద్యుత్ పరికరాలు, తాగునీటి వసతి ఏర్పాటు, మరుగుదోడ్ల కు మరమ్మత్తు ఇతర పనులు కొనసాగుతుండగా, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ H3 Class=subheader-styleపూజారి గౌతమి /h3pతో కలిసి బుధవారం పరిశీలించారు.

పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు.

అధికారులకు పలు సూచనలు చేశారు.గడువులోగా యూనిఫామ్స్ అందించాలిగడువులోగా యూనిఫామ్స్ అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

తంగళ్లపల్లి మండలం మండేపల్లి లోని భాగ్యలక్ష్మి మహిళ శక్తి టైలరింగ్ సెంటర్, ముస్తాబాద్ మండలం గూడెంలోని శ్రీ వీరాంజనేయ మహిళ శక్తి టైలరింగ్ సెంటర్ లలో స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ కుడుతుండగా కలెక్టర్, అదనపు కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా యూనిఫామ్స్ కుడుతున్న మహిళలతో మాట్లాడారు.రోజు ఎన్ని కుడుతారని, ఎన్ని రోజులు ఉపాధి దొరుకుతుంది? మిగితా రోజుల్లో ఏమి చేస్తారో అడిగి తెలుసుకున్నారు.

యూనిఫామ్స్ త్వరితగతిన కుట్టి ఇవ్వాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా 41, 680 యూనిఫామ్స్ కుట్టడం లక్ష్యం కాగా, ఇప్పటిదాకా 20, 314 పూర్తి అయ్యాయి.

మొత్తం జిల్లాలో 38 మహిళ సమాఖ్యాల పరిధిలోని 536 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది.

ఇక్కడ డీఆర్డీఓ శేషాద్రి, డీఈఓ రమేష్ కుమార్, ఆర్అండ్ బీ డీఈ నాగరాజు, డీపీఎం సుధారాణి,ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంఈఓలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీకి కేటీఆర్ … వెంట 20 మంది ఎమ్మెల్యేలు ?