రోడ్డుపై వెళ్తున్న వారిని దోచువాలని వచ్చిన దొంగ.. దంపతులు చేసిన పని అదుర్స్ కదూ..!
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా దాడులు, చోరీలు, దారి దోపిడీలు జరుగుతూ ఉన్న విషయాలను వార్తలలో చూస్తూనే ఉన్నాము.
అయితే ఇలాంటి సందర్భాలలో కొంతమంది ఎంతో తెలివిగా చోరీ చేయాలని ప్రయత్నించగా.ఎదుటివారు అలర్ట్ గా ఉండడంతో వారే చివరకు దొరికి పోయేవారు.
ఇక మరికొందరు అయితే నగదు, నగలు దోచుకోవాలని ప్రయత్నం చేసినా ప్రజలు అలర్ట్ కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే తాజాగా ఒక దొంగ ఒక జంట దగ్గర దోచుకోవాలని ప్రయత్నం చేయగా చివరికి అతడికే చిక్కు ఎదురైంది.
ఘటన జరిగి చాలా కాలం అవుతున్న.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
"""/" /
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఒక భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు.
ఒక దొంగ(thief) బైక్ లో వెళ్తూ వారిని అడ్డుకొని వారి దగ్గర ఉన్న డబ్బులను దోచుకోవాలని ప్రయత్నం చేయాలని వారిని ఫాలో అయ్యాడు.
ఈ క్రమంలో ఒక నిర్మానుష్య ప్రదేశం రాగానే ఒక్కసారిగా వారిని పక్కకు ఆపి తుపాకీ బయటకు తీసి బెదిరించాలని ప్రయత్నం చేశాడు.
అయితే., దంపతులు వెంటనే అలర్ట్ అయ్యి భర్త వెంటనే ఆ దొంగ పై దాడికి దిగి.
అతని చేతిలో ఉండే గన్ ను గట్టిగా పట్టుకున్నాడు.దీంతో వెంటనే అతని భార్య కూడా దొంగ పై దాడి చేయడం.
ఇలా భార్యాభర్తలు(husband And Wife) ఇద్దరు ఆ దొంగ పై దాడి చేయడం మనం వీడియోలో చూడవచ్చు.
"""/" /
పైగా దొంగ హెల్మెట్(Helmet) తీసుకొని దాంతో కూడా అతడిని కొట్ట సాగారు.
ఇందుకు సంబంధించిన మొత్తం అక్కడే ఉండే సీసీ కెమెరాలో(CC Camera) రికార్డు అయింది.
ఇక ఈ వీడియోని చూసిన కొంతమందిని నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.ఆ దొంగకు తగిన బుద్ధి చెప్పారు ఆ దంపతులు అంటూ కొందరు కామెంట్ చేయగా.
ఇక మరికొందరైతే వారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు.. నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!