వీడియో: ముచ్చట్లలో పడి రైలుకి అడ్డంగా వెళ్లిన మహిళ.. గుద్దేయడంతో..?

రైల్వే ప్లాట్‌ఫామ్స్‌, రైల్వే స్టేషన్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇప్పటికే చాలామంది అనాలోచితంగా రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తూనో లేదంటే మరో పిచ్చి పని చేస్తూనో ప్రాణాలు కోల్పోయారు.

ఇలాంటి పర్సన్స్ కి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి.తాజాగా సోషల్ మీడియాలో అలాంటి మరొక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియో రైల్వే ప్లాట్‌ఫామ్‌ మీద నడుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తోంది.

వీడియోలో, ఒక మహిళ తన బిడ్డను చేత్తో పట్టుకుని తన స్నేహితులతో కలిసి ప్లాట్‌ఫాం మీద నడుస్తోంది.

ఆమె వేరే వ్యక్తితో మాటల్లో పడి రైల్వే ట్రాక్లను అడ్డంగా దాటడం మొదలుపెట్టింది.

దానిపైన ఒక రైలు వస్తున్నదని గమనించకుండా రైలు పట్టాలను దాటాలని నిర్ణయించుకుంది. """/" / ఆమె వెనుక నుంచి రైలు వస్తున్నా, ఆ ప్రమాదాన్ని ఆమె త్వరగా గుర్తించలేకపోయింది.

రైలు( Train ) చాలా దగ్గరగా వచ్చే వరకు తన ప్రాణానికి ముప్పు ఉందని గ్రహించలేదు.

తీరా ట్రైన్ వస్తుందని రియలైజ్ అయ్యేలోపు చాలా ఆలస్యమైపోయింది.ఆ భయంకరమైన క్షణంలో రైలు ఆమెను బలంగా ఢీ కొట్టింది.

ఆ దెబ్బకు ఆమెను, ఆమె చేతిలో ఉన్న బిడ్డ గాల్లో ఎగురుతూ ప్లాట్‌ఫామ్‌ పైకి బొమ్మల్లాగా పడిపోయారు.

"""/" / ఆ ప్రమాదం చూడగానే అక్కడ ఉన్న వారంతా దిగ్బ్రాంతికి గురయ్యారు.

కొందరు వెంటనే వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఆ మహిళకు, ఆమె బిడ్డకు ఏమైందో ఎవరికీ తెలియదు.

ఈ భయంకరమైన సంఘటన చూసి ప్రతి ఒక్కరూ భయపడిపోయారు.ఈ వీడియో మనకు ఒక పాఠం చెబుతుంది.

ఒక చిన్న తప్పు నిర్ణయం ఎలా ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందో ఇది చూపిస్తుంది.

రైలు స్టేషన్ ( Railway Station )ప్లాట్‌ఫాం అయినా, రోడ్డు అయినా, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా పిల్లలతో ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం.ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు.

ఏదైనా రోడ్డు దాటే ముందు కొంచెం ఆగి చుట్టూ చూసుకోవడం మంచిది.ఇది మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!