సాయి ధరమ్ తేజ్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మహిళ.. అసలు కారణం ఏంటంటే?
TeluguStop.com
కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి.
సినిమాల విషయంలో కాకుండా వ్యక్తిగతంగా ఎక్కువ ఎదుర్కొంటారు.ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి మాత్రం విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
ఇప్పటికి చాలామంది సెలబ్రెటీలు ఫ్యాన్స్ నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.ఇక ఆ సెలబ్రెటీల ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు.
తమకిష్టమైన అభిమాన నటీనటుల కోసం కొన్నిసార్లు కొన్ని కిలోమీటర్ల దూరంతో కాలినడకన కూడా వస్తుంటారు.
వారిని చూడటానికి ఎంత కష్టమైనా ఎదుర్కొంటారు.కొన్ని కొన్ని సార్లు వారికి ఏదైనా ప్రమాదం ఎదురైన కూడా పట్టించుకోరు.
ఎందుకంటే నటీనటుల పై వారు చూపించే అభిమానం అలా ఉంటుంది కాబట్టి.ఇదంతా పక్కన పెడితే.
తాజాగా ఒక మహిళ సాయిధరమ్ తేజ్ ఇంట్లోకి చొరబడింది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి అందరికి పరిచయమే.
మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టి తన నటనతో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఈయన తొలిసారిగా 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఉత్తమ నటుడుగా కూడా అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించాడు.ఇక కొన్ని సినిమాలు తనకు మంచి సక్సెస్ ను ఇవ్వగా మరికొన్ని సినిమాలు తనకు నిరాశ పరిచాయి.
"""/"/
ఇక గతంలో తాను నటించిన రిపబ్లిక్ సినిమా కూడా విడుదలై మంచి సక్సెస్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ మరిన్ని అవకాశాలు అందుకోవటంతోనే ప్రస్తుతం ఆ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ఇక సాయిధరమ్ తేజ్ వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.చాలామందికి తన వంతు సహాయం చేస్తూ ఉంటాడు.
ఇక ఈయనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈయన ఇంట్లోకి ఒక మహిళ చొరబడటానికి ప్రయత్నించింది.
దీంతో సెక్యూరిటీ తనను అడ్డుకొని పోలీసులకు అప్పజెప్పగా.ఆమె చొరబడటానికి కారణం ఏంటో పోలీసులు తెలిపారు.
ఆ మహిళ తమిళనాడు లో మధురై కి చెందిన జోష్ కమల అని తెలిపారు.
"""/"/
అయితే ఆమెకు సాయి ధరమ్ తేజ్ అంటే చాలా ఇష్టమని.దీంతో అతడిని కలవడానికి చాలా ప్రయత్నిస్తుంది అని అందుకే ఆయనను కలవడం కోసం కష్టపడి హైదరాబాద్ కు వచ్చిందని ఇక హైదరాబాద్ లో అయిన ఇల్లు ఎక్కడుందో తెలుసుకొని ఇంటికి వెళ్లిందని తెలిపారు.
ఆమె ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో వెంటనే సెక్యూరిటీ తనను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు అప్పగించాడని తెలిపారు.
ఇక ఆమెకు మతిస్థిమితం సరిగా లేదు అని పోలీసులు తెలిపారు.ఇక సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.