పప్పీలకు ఫుడ్ పెట్టిన మహిళ.. తల్లి కుక్క ఎలా థాంక్స్ చెప్పిందో చూడండి..

కుక్కలు మనుషులకు నమ్మకమైన స్నేహితులుగా మెలుగుతూ వస్తున్నాయి.అవి తమ తోకలను ఊపడం, వారి యజమానులను నాకడం లేదా వారిని కౌగిలించుకోవడం వంటి వివిధ మార్గాల్లో తమ ప్రేమను, కృతజ్ఞతా భావాన్ని కూడా వ్యక్తం చేస్తాయి.

కొన్నిసార్లు, కుక్కలు( Dogs ) తమకు లేదా తమ కుక్కపిల్లలకు ఆహారం పెట్టే అపరిచితులకు కూడా తమ కృతజ్ఞతలు తెలియజేస్తాయి.

అటువంటి హార్ట్ టచింగ్ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

@buitengebieden అనే ట్విట్టర్ పేజీ ద్వారా భాగస్వామ్యం చేయబడింది.ఒక స్ట్రీట్ లో కనిపించిన కొన్ని కుక్కపిల్లలకు తినిపిస్తున్న ఒక మహిళ ఆహారం అందించడం మనం వీడియోలో చూడవచ్చు.

ఆమె ఎలా ఆహారం పెడుతూ ఉండగా తల్లి కుక్క పిల్లలను చూస్తూ ఉంది.

అంతేకాదు, తల్లి కుక్క, ఆ మహిళ వద్దకు వెళ్లి, మెల్లగా తన ముందుకాలను సదరు మహిళా ( Female )చేతి పై పెట్టి థాంక్స్ చెప్పింది.

దాంతో ముగ్ధురాలైన ఆ మహిళ చిరునవ్వుతో కుక్క తలను నిమిరింది, కుక్క కృతజ్ఞతతో ఆమె వైపు చూస్తుంది.

తల్లి కుక్క తన కుక్కపిల్లలకు ఆహారం ఇచ్చినందుకు ఈ మహిళకు కృతజ్ఞతలు చెబుతుందని ఈ ఈ వీడియో క్యాప్షన్‌లో రాశారు.

"""/" / ఈ వీడియో 2023, నవంబర్ 3న పోస్ట్ చేయగా, ఇప్పటికే దీనికి కోటి దాకా వ్యూస్, లక్షన్నరకు పైగా లైకులు వచ్చాయి.

వైరల్‌గా మారిన ఈ వీడియో చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.ఇది చూసిన నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు.

థిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు.వాటిపై కాస్త దయచేసి చెబితే చాలు అవి తిరిగి మనం ఊహించనంత ప్రేమను కురిపిస్తాయని మరొక యూసర్ వ్యాఖ్యానించారు.

ఈ హార్ట్ టచింగ్ వీడియో మీరు కూడా చూసేయండి.

విశాల్ ఆరోగ్యం గురించి రియాక్ట్ అయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. అసలేం జరిగిందంటే?