మనికే మాగే సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసిన మహిళ.. ఫిదా అవుతున్న నెటిజన్లు..
TeluguStop.com
సంగీతానికి మనుషులే కాదు.ప్రకృతి కూడా పులకిరించిపోతుంది.
సంగీతానికి ఆ శక్తి ఉంది.సంగీతానికి భాష, దేశం, ప్రాంతం అంటూ ఎలాంటి హద్దులు లేవు.
దానికి అన్ని ప్రాంతాలు ఒక్కటే, అన్ని భాషలు ఒక్కటే.అందుకే ఇటీవల బయటి దేశాల సంగీతం కూడా మన దేశంలో చాలా పాపులర్ అవుతున్నాయి.
తెలుగు పాటలు కూడా బయటి దేశాల ప్రజల నోళ్లలో నానుతున్నాయి.మన బతుకమ్మ పాటలు అయితే అమెరికా, న్యూయార్క్, గల్ఫ్ కంట్రీస్‌లో మారుమోగాయి.
అంతటి గొప్పదనం, విశిష్టత పాటలకు సంగీతానికి ఉంది.అయితే ఇటీవల ఇతర దేశాల పాటలు మన దగ్గర చాలా ఫేమస్ అయ్యయి.
అందులో ఒకటి మణికె మాగె హితే అనే పాట ఒకటి.మణికె మాగె హితే అనే సాంగ్ శ్రీలంక నుంచి వచ్చింది.
ఇది ఒక ప్రేమ గీతం.తన ప్రియుడిని తలుచుకుంటూ ఓ యువతి పాడే పాట.
ఈ పాట అక్కడ ఎంత హిట్ అయ్యిందో తెలియదు కానీ మన దేశంలో మాత్రం చాలా ప్రాచూర్యం పొందింది.
సంగీతానికి హద్దులు లేవు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదహారణ.సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఎక్కడ చూసినా ఈ పాటే కనిపిస్తోంది.
ముఖ్యంగా ఇన్‌స్టా గ్రామ్‌లో దీని పాపులారిటీ మరీ ఎక్కువ.దీనిపై చాలా మంది రీల్స్ చేస్తున్నారు.
"""/"/
దీనిని రీమేక్ కూడా చేస్తున్నారు.మరి కొందరు ఈ పాటలో తమ ప్రియుడిని తలుచుకుంటూ నృత్యం చేస్తున్నారు.
ఈ పాటతో చాలా మందికి సెలబ్రెటీ స్టేటస్ వచ్చేసింది.అదే పాటపై ఓ మహిళ చాలా చక్కగా డ్యాన్స్ చేసింది.
చీర కట్టుకొని సంప్రదాయ నృత్యాన్ని ఈ డ్యాన్స్‌కు జోడించింది.దీంతో ఈమె చేసిన డ్యాన్స్ ఇన్‌స్టా గ్రామ్‌లో వైరల్ గా మారింది.
చాలా చక్కటి అభినయంతో, ఎక్కడా కూడా జిగుప్సాకరంగా లేకుండా ఈ డ్యాన్స్ సాగుతోంది.
ఈ డ్యాన్స్‌కు చాలా లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి.
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?