భర్త దహన సంస్కారాలు ఇంట్లో చేసిన భార్య.. అంత కష్టం ఏమొచ్చిందంటే..?

ఒక భార్య తన భర్త మృతి దేహాన్ని ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే దహన సంస్కారాన్ని నిర్వహించిందంటే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదేమో.

సాధారణంగా ఏ ఇంట్లోనైనా మనిషి చనిపోతే సాంప్రదాయాల ప్రకారం కొన్ని పద్ధతులు పాటించి అంతిమ సంస్కారాలు నిర్వర్తిస్తారు.

మరి ఆ ఇంట్లో అలా జరగకపోవడానికి కారణం వింటే ఎవరి గుండె అయినా తరుక్కుపోతుంది.

పిల్లలు తమ కాళ్లపై నిలబడ్డాక తల్లిదండ్రులకు అండగా నిలబడాలి.కానీ ఆ ఇంట్లో తల్లిదండ్రులకు అండగా నిలపడకుండా వీరి సంపాదన పైనే ఆ కుమారుల ఆశ.

అసలు ఏం జరిగిందో చూద్దాం. """/" / కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్( Potuganti Harikrishna Prasad ) (60), లలిత( Lalita ) భార్య భర్తలు.

వీరికి ఇద్దరు కుమారులు సంతానం.మొదటి కుమారుడు కర్నూల్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు.

రెండవ కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు.ఇక ఈ వృద్ధ దంపతులు పత్తికొండలోనే ఒక మెడికల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

అయితే ఈరోజు సోమవారం ఉదయం హరికృష్ణ ప్రసాద్ ఇంట్లో నుంచి పొగలు రావడం స్థానికులు గమనించారు.

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.

ఎస్సై తో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. """/" / పోలీసులు లలితను విచారించగా.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త హరికృష్ణ ప్రసాద్ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారని తెలిపింది.

ఈ విషయం బయట ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించాలని అనుకుంది.

పెట్రోల్ పోసి భర్త మృతదేహానికి నిప్పు పెట్టింది.ఇదంతా తాను తన కుమారులకు భయపడి చేశానని పోలీసులకు తెలిపింది.

కుమారులు తమను సరిగా చూసుకోరని, కేవలం తమ వద్ద ఉండే ఆస్తి కోసం మాత్రమే అప్పుడప్పుడు వస్తూ పోతుంటారని కన్నీరు మున్నీరుగా వినిపించింది.

ఇక తన భర్త చనిపోయాడు అన్న విషయం తెలిస్తే వెంటనే ఆస్తిని రెండు ముక్కలు చేసి పంచుకుని తనను ఒంటరి చేసి వెళ్లిపోతారనే భయంతో ఇలా చేశానని లలిత చెప్పిన మాటలు అందరిని కలచివేశాయి.