అచ్చు గుద్దినట్లు కుటుంబమంతా ఒకేలా డ్యాన్స్.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను ఆకట్టుకుంటాయి.

ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, ఆసక్తికరమైన వీడియోలు వారి మనసులను రంజింపజేస్తాయి.అలాగే డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువమంది ఇష్టంగా చూస్తున్నారు.

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇక్కడ వైరల్ అవుతోంది.అందులో ఒక కుటుంబం మంచి టైమింగ్ తో డ్యాన్స్ చేసి అలరించింది.

ఈ కుటుంబంలో భార్యాభర్తలు, ఒక కుమార్తెను మనం చూడవచ్చు.సంగీతానికి అనుగుణంగా వీరు వేసిన డ్యాన్స్ చూస్తే వీరి డాన్స్ మాస్టర్స్ అనే అనుమానం కలగక మానదు.

ఈ వీడియోలో ఏముందంటే, ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి స్టెప్పులేస్తున్నాడు.

మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది.ఆ మ్యూజిక్ కు అనుగుణంగా ముగ్గురూ ఒకే స్టైల్‌లో ఒకే రిథమ్ లో డ్యాన్స్ చేయడం విశేషం.

వీరు చేస్తున్న డ్యాన్స్ చూస్తుంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాదని అస్సలు అనిపించదు.వాస్తవానికి.

ఇలా వారు ఒకే రీతిలో నృత్యం చేయడం చాలా అద్భుతంగా అనిపించక మానదు.

"""/"/ ఇకపోతే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో Shuffledance.tubeలో షేర్ చేయగా ఇప్పటివరకు ఒక లక్షా 90 వేల వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం.

ఆ కౌంట్ ఇంకా పెరుగుతోంది.అలాగే 4 వేల మందికి పైగా లైక్ చేయగా వీడియో చూసిన ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.

డాన్స్ అద్భుతం అని కొందరంటే, అసలు వీరు ఏ పాటపై డ్యాన్స్ చేస్తున్నారంటూ మరికొందరు కామెంట్స్‌ చేశారు.

అలాగే మా ఇంట్లో ఇలాంటి డ్యాన్స్ చేస్తే మా అమ్మ, నాన్న మైక్రోవేవ్ లేదా ఓవెన్ పగలగొడతారని ఒక వినియోగదారు చమత్కరించాడు.

వీడియో: పాడుబడిన ఇంట్లో వెతుకుతుంటే ఊహించని ట్విస్ట్.. గోడల్లో నిధి చూసి షాక్!