సబ్బండ వర్గాల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ ధ్యేయం..ఎంపీపీ పడిగల మానసరాజు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో 7 గురుకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 2,15,000 రూ లు మంజూరు కాగా అట్టి చెక్కులను ఎంపీపీ పడిగల మానస( MPP Padigala Manasa ), స్థానిక ప్రజానిధులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానస మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ ధ్యేయమని, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించుకొని దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తప్పకుండా ఆర్థిక సహాయం అందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
మంత్రి కేటీ రామారావు( Minister KT Rama Rao ) సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తున్నామని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేటీ రామారావు ని భారీ మెజార్టీతో గెలిపించుకొని వారి సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని ఎంపీపీ పడగల మానస అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోడి అంతయ్య, ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి, ఏఎంసి డైరెక్టర్ సద్ధ శోభ, మైనార్టీ అధ్యక్షుడు హామీద్, వార్డు మెంబర్లు క్యారమ్ జగత్,రెడ్డి పరశురాములు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏగుర్ల కనకరాజు, నేరెళ్ల అనిల్ గౌడ్, నులుగొండ శ్రీనివాస్, పసువుల దుర్గయ్య, అంకారపు మహేందర్ భీమని అరవింద్, బొగ్గు లింగం, వెంకటరంగం, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
యూకే పార్లమెంట్‌లో భారత సంతతి నేత ప్రీతి పటేల్‌కు కీలక పదవి