బీజేపీలో డొల్లతనం.. ఓటమిని ఒప్పుకున్నట్లేనా?

తెలంగాణ బీజేపీ( Telangana BJP )లో గత కొన్నాళ్లుగా డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా అధ్యక్ష మార్పు చేసినప్పటి నుంచి పార్టీ పరిస్థితులన్నీ మందకోడిగా సాగుతున్నాయి.ఓవైపు ఎన్నికల సమరంలో అధికార బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుంటే బీజేపీ మాత్రం అసలు ఎన్నికలే లేవన్నట్లుగా వ్యవహరిస్తోంది.

పార్టీ అగ్రనాయకులు తరచూ రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు.

బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో కమలం పార్టీ జెట్ స్పీడ్ లో దూసుకొచ్చింది.

"""/" / ఈ విషయాన్ని కమలనాథులు సైతం ఒప్పుకుంటున్నారు.కానీ అధ్యక్ష మార్పు చేసి ఆ బాద్యత కిషన్ రెడ్డి( Kishan Reddy )కి అప్పగించిన తరువాత పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది.

దానికి తోడు కర్నాటక ఎన్నికల్లో( Karnataka Elections ) ఆ పార్టీ ఓటమి తెలంగాణలో కూడా గట్టిగానే ప్రభావం చూపింది.

కాషాయ పార్టీలోని చాలమంది నేతలు ఇతర పార్టీల గూటికి చేరుతున్నారు.ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అగ్రనేతల మద్య సఖ్యత లేకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు విషయంలో కూడా కమలం పార్టీ అధిష్టానం పూర్తి కాన్ఫిడెంట్ తో లేనట్లు కనిపిస్తోంది.

ఇక తాజాగా తుది జాబితా అభ్యర్థులను ప్రకటించడంతో 111 స్థానాలకు గాను బీజేపీ, 8 స్థానాలకు గాని జనసేన పార్టీకి సీట్ల కేటాయింపు జరిగాయి.

"""/" / ఇలా ఎంత హడావిడి జరుగుతున్నప్పటికి పార్టీలో మాత్రం అనుకున్న జోష్ కనిపించడం లేదు.

ఇంతవరకు ప్రచార కార్యక్రమాలపై కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు కమలనాథులు.

దీంతో కమలం పార్టీ ముందుగానే ఓటమిని అంచనా వేసిందా అనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.

అయితే బీజేపీలో ఈ స్థాయిలో డొల్లతనం ఏర్పడడానికి కారణం బండి సంజయే( Bandi Sanjay ) అనేది కొందరి వాదన.

ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవి నుంచి దూరమైనది మొదలుకొని పార్టీ కార్యక్రమాలకు చాలావరకు దూరమయ్యారు, గతంలో ఉన్న ఉత్సాహం ఆయనలో లేదనేది చాలమంది చెబుతున్నా మాట.

ఆయన కారణంగా పార్టీలో చాలమంది నేతలు అంటిఅంతనట్టుగా వ్యవహరిస్తున్నాట్లు టాక్ నడుస్తోంది.మరి కమలం పార్టీలో ఈ డొల్లతనం ఇలాగే కొనసాగుతుందా లేదా ఈ 20 రోజుల్లో పార్టీ నేతలు తిరిగి యాక్టివ్ అవుతారా అనేది చూడాలి.

సినిమా వాళ్ళ దెబ్బకి విశ్వక్ సేన్ అడ్రస్ మార్చేశాడట !