ఇది విన్నారా? ఆ సముద్రంలో వున్న నీరు మాయమైపోతోందట… సైంటిస్టులు గగ్గోలు!

అదేంటి? సముద్రంలో వున్న నీరు మాయం అయిపోవడం ఏమిటి? మరీ విడ్డురం కాకపోతే అని అనుకుంటున్నారు కదూ.

మీరు విన్నది నిజమే.ఈ ప్రపంచంలోని ఒక దేశంలో సముద్రపు నీరు అంతకంతకు తగ్గుతూ ఉండడం ఇపుడు చర్చనీయాంశమైంది.

ఇలా ఎందుకు జరుగుతుందో అని అక్కడ శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.తాజా నివేదిక ప్రకారం.

మాల్టా, గోజో తీరాలలో సముద్రపు నీరు రికార్డు స్థాయికి పడిపోయింది.జనవరి నుంచి దాదాపు 50 సెంటీమీటర్ల మేర తగ్గుదల నమోదైంది.

"""/"/ ఇక నీటి కొరత కారణంగా బీచ్ పొడవుగా మరియు విశాలంగా మారిందని అక్కడి నివేదికలు చెబుతున్నాయి.

ఇంతకుముందు సముద్రపు ఉపరితలం కింద ఉన్న రాళ్లు ఇపుడు అక్కడ కనిపించడం కొసమెరుపు.

దీంతో స్థానిక ప్రజలు అయోమయంలో పడ్డారట.మాల్టా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ ఆల్డో డ్రాగో.

సునామీ సిద్ధాంతాలు మరియు ఇటీవలి భూకంపాన్ని ఉదాహరణగా ఉపయోగించి ఈ విషయాన్ని వివరించారు.

భూమిలో కొన్ని మార్పులు కారణంగా ఈ అసాధారణ సంఘటనలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు.

"""/"/ అయితే ఇందులో ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదని, సముద్రంలోని నీటి మట్టం మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆయన అంటున్నారు.

దాంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారు.వేసవి కాలంలో కూడా అక్కడి నీటి మట్టం పెరుగుతూనే ఉండడం గమనార్హం.

గత 100 సంవత్సరాలలో, ప్రపంచ ఉష్ణోగ్రత సుమారు 1 డిగ్రీ సెల్సియస్ (1.

8 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరిగింది.దీంతో సముద్ర మట్టం దాదాపు 6 నుంచి 8 అంగుళాల మేర పెరిగింది.

కానీ 2050 నాటికి ఇది 12 అంగుళాల (30 సెం.మీ.

) వరకు పెరగవచ్చని నాసా అంచనా వేసింది.

హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్న ఈజీగా ఈ ఆయిల్ తో చెక్ పెట్టొచ్చు.. తెలుసా?