వైరల్ వీడియో: మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి నిదర్శనం ఈ సంఘటన చాలు..

మనలో చాలామంది ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ప్రయత్నిస్తాము.ఎక్కడైనా వృద్ధులు రోడ్లపై అక్కడక్కడ కనిపిస్తున్న సమయంలో వారికి ఏదో విధంగా సహాయం అందించే ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం.

ఇలా చేయడం ద్వారా కాస్త హృదయానికి శాంతి లభించినట్లుగా ప్రశాంతంగా ఉంటుంది.అలాగే సహాయం పొందిన వారు కూడా ఆనందంగా ఉంటారు.

నిజానికి ఇదే నిజమైన మానవత్వం.ప్రస్తుత కాలంలో మానవత్వం ఎంతమంది దగ్గర ఉంది అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రోడ్డుపై విజిత జీవిగా పడే ఉన్నా కానీ చాలామంది పట్టించుకునేవారు లేకుండా పోయిన రోజులు ఇవి.

ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూనే ఉంటాం.

ఈ మధ్యకాలంలో కొందరైతే ప్రమాదం జరుగుతున్న సరే ప్రమాదాన్ని కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నిస్తారే తప్పించి దాని నుంచి కాపాడడానికి ప్రయత్నించేవారు కూడా లేకపోలేదు.

ఇకపోతే తాజాగా ఓ హృదయానికి హాయిగా అనిపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.

వైరల్ గా మారిన వీడియో సంబంధించిన విషయాలు చూస్తే. """/" / వీడియోలో ఓ వ్యక్తి బైక్ పై నడుపుతూ వెళ్తూ ఉంటాడు.

దారి మధ్యలో ఓ మహిళ తన బిడ్డతో రోడ్డును దాటేందుకు ప్రయత్నం చేస్తుంది.

ఆ సమయంలో ఆమెతో ఉన్న బాలుడికి కాళ్లకు చెప్పులు లేవు.అంతేకాకుండా పిల్లాడికి సరైన వస్త్రాలు కూడా కనిపించలేదు.

దాంతో అతను వారిని రోడ్డు పక్కకి పిలిచి బైక్ నడుపుతున్న వ్యక్తి స్వతహాగా వెళ్లి చెప్పులు కొని తెచ్చి ఆ పిల్లాడికి కొత్త చెప్పులు కొని వేసుకోవడానికి ఇచ్చాడు.

ఆ సమయంలో ఆ చిన్నారి తల్లి ముఖం 1000 వాట్స్ బల్బులాగా వెలిగిపోతుంది.

నిజంగా ఆ సంతోషం, ఆనందం వెలకట్టలేనిది.ఆ తర్వాత పిల్లాడికి ఒక షర్ట్, ఒక నిక్కర్ కూడా బైక్ నడిపే వ్యక్తి పిల్లాడికి ఇచ్చి వారికి బాయ్ చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

"""/" / ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిపై నెటిజెన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

ఇలాంటి రోజుల్లో ఇలాంటి ఉద్వేగభరితమైన వీడియోను చూసి చాలా రోజులైంది అంటూ కామెంట్ చేయగా.

, మరికొందరైతే నువ్వు ఇలానే మరికొందరికి సహాయం చేయాలని కోరుతున్నారు.

హౌస్ అరెస్ట్ పై మిథున్ రెడ్డి ఫైర్ … బుద్ధి లేని వారే అలా మాట్లాడుతున్నారు