20వ శతాబ్దంలో ఎన్నో కనిపెట్టి ఎంతో మంది ముందుకు కొనసాగుతుంటే కొంత మంది మాత్రం ఇంకా క్షుద్రపూజలు నరబలులు అనుకుంట జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
అయితే క్షుద్ర పూజలు చేస్తున్నారని నెపంతో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని దారుణంగా హతమార్చారు.
ఇక ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి జిల్లాలోని పద్మగిరి పంచాయతీ కెందుగుడ గ్రామంలో చోటు చేసుకుంది.
అయితే ఈ దారుణానికి మాత్రం గ్రామస్తులే కారకులు.క్షుద్ర పూజలు చేస్తున్నారని అనుమానంతో ఏడవ తరగతి చదువుతున్న సోమార్ మడకామి అనే విద్యార్థిని గ్రామస్తులంతా కలిసి హత్య చేశారు.
ఇకపోతే ఈ విషయంపై పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కొద్ది రోజుల నుంచి కింద గ్రామానికి చెందిన 20 మంది చిన్నారులు క్రమంగా చనిపోతూ వస్తున్నారు.
ఇకపోతే అదే గ్రామంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు పూజలు వల్లనే పిల్లలు ఇలా చనిపోతున్నారు అని గ్రామస్తులు నమ్మసాగారు.
దీనితో ఇటీవల కొత్తగా క్రైస్తవ మతం లోకి చేరిన ఏడో తరగతి విద్యార్థి చేస్తున్న పూజల వలెనే తమ గ్రామంలో చిన్నారులను మరణ శాపం కలిగిస్తుందని గ్రామస్తులు భావించారు.
ఇకపోతే అతన్ని చంపేస్తే ఈ సమస్యలు దూరం అవుతాయని వారు ఆలోచించి హత్యకు పథకం వేసి మరి ఆ కుర్రాడిని హతమార్చారు.
ఇంట్లో తండ్రి లేని సమయం చూసి బాలుడు ఇంటికి పలువురు గ్రామస్తులు వెళ్లి మాట్లాడాలి బయటికి రా అంటూ అతన్ని తీసుకువెళ్లి తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో అబ్బాయిని విచక్షణ రహితంగా కొట్టి చంపేశారు.
దీనితో ఆ అబ్బాయి అక్కడికక్కడే మరణించాడు.ఆ తర్వాత దానికి దగ్గరలో ఉన్న ఒక తోటలో గ్రామస్తులు ఆ శవాన్ని పూడ్చి పెట్టారు.
ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహం కోసం గ్రామం అంతా వెతికి గ్రామస్తులు అందరిని విచారించగా కొందరు గ్రామస్తులు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
అయితే ఆ తర్వాత గ్రామం సమీపంలో ఉన్న తోటలో యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
దాంతో డెడ్ బాడీ ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
దీంతో అనుమానం ఉన్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.