ఎప్పుడు పోయినవ్ ఇప్పుడు వచ్చినవ్ అంటూ ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు
TeluguStop.com
యాదాద్రి జిల్లా:ఆలేరు అధికార పార్టీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.
కాల్వపల్లి గ్రామంలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన
చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు.మా గ్రామానికి ఏం చేశారంటూ ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆమె అవాక్కయ్యారు.
కాల్వపల్లి గ్రామ ప్రజలు ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి ఏరోజు మీ ముఖం కనిపించలేదని,ఈరోజు ఎందుకు వాచ్చరంటూ,అయినా నిధులు లేకుండా ఉత్తుత్తి శంకుస్థాపనలు ఎందుకంటూ అంటూ కాల్వపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం.