బతికి ఉన్న పీతను కరకరా నమిలేసి తిన్న మహిళ.. వీడియో వైరల్..

ఒక్కో దేశంలో ఒక్కో ఆహార సంస్కృతి ఉంటుంది.ప్రజలు తమకంటూ ఒక స్పెషల్ ఫుడ్స్ కనిపెడతారు.

ఆంధ్రాలో గోంగూర, ఆవకాయ స్పెషల్.తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీ స్పెషల్.

ఇలా ప్రతి ప్రాంతంలో స్పెషల్ ఫుడ్స్ దొరుకుతుంటాయి.అయితే తూర్పు ఆసియా దేశాల్లో ప్రజలు కొన్ని విచిత్రమైన, అరుదైన ఆహార పదార్థాలను తింటారు.

ఆ ఆహార పదార్థాలను చూస్తేనే ఒక్కోసారి మనకు భయం కలుగుతుంది.అలాంటి భయం కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / ఆ వీడియోలో ఒక యువతి బతికి ఉన్న పీతను( Crab ) కరకరా నమిలేసి తింటుంది.

ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.'@monsterpredators2024' ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ఇలాంటి చిత్ర విచిత్రమైన వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేసింది.

ఇప్పుడు వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోలో ఒక అమ్మాయి చాలా అసహ్యంగా కనిపించే ఆహారాలు తింటూ చిరాకు పుట్టించింది.

తూర్పు ఆసియా దేశాల్లో పాములు, కుక్కలు, గబ్బిలాలు ( Snakes, Dogs, Bats )లాంటి జంతువులను తింటారు.

భారతదేశం, పాశ్చాత్య దేశాలలో చేపలను తినడం సర్వసాధారణం.కానీ ఈ వీడియోలో ఆ అమ్మాయి పీతను బతికి ఉండగానే తినడం చాలా విచిత్రంగా అనిపించింది.

"""/" / ఒక వీడియోలో, ఒక యువతి పనికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఫార్మల్ దుస్తులు ధరించి ఉన్నారు.

ఆమె కిచెన్‌లో ఒక పెద్ద బకెట్‌లో ఉన్న పీతలు సూప్‌లో నుంచి తీసి తన ప్లేట్‌లో పెడుతుంది.

ఆ తర్వాత, ఆమె ఒక జీవించి ఉన్న పీతను తీసి, దాన్ని నేరుగా తినడం మొదలుపెడుతుంది.

ఈ వీడియోను ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా చూశారు.చాలా మంది ఈ వీడియో గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఒకరు, "నేను భోజనం చేస్తుండగా ఈ వీడియో చూసి వాంతి చేసుకున్నాను" అని అన్నారు.

మరొకరు, "ఇలాంటి పనుల వల్లే కరోనా వ్యాధి వ్యాపించింది" అని కామెంట్ చేశారు.

మరొకరు, "ఎందుకు నీ ఆకలి తీర్చుకోవడానికి ఒక మూగ జీవిని చంపుతున్నావు?" అని ప్రశ్నించారు.

పీతలను బాగా వండి తింటేనే శ్రేయస్కరం.లేకపోతే చాలా రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో లో వస్తున్న సినిమా బడ్జెట్ ఎంతంటే..?