మద్యం తాగి మహిళను ముద్దు పెట్టుకోబోయిన లేడీ పోలీస్.. వీడియో వైరల్..

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ( Siliguri, West Bengal )చాలా దారుణమైన సంఘటన జరిగింది.

మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ పెట్రోల్ వ్యాన్‌లో పనిచేసే ఒక పోలీస్ కానిస్టేబుల్, మద్యం మత్తులో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చే లాగా ఒక వీడియో వైరల్ గా మారింది.

అందులో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఒక సామాన్య మహిళను దగ్గరికి తీసుకొని లిప్ టు లిప్ కిస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది.

"""/" / సిలిగురి పోలీస్ కమిషనరేట్‌లోని మహిళల భద్రతను పెంచడానికి ఇటీవల పింక్ పెట్రోల్ వ్యాన్‌లను ( Pink Petrol Vans )ప్రారంభించారు.

ఈ వ్యాన్‌లు 24 గంటలు పనిచేస్తాయి.బుధవారం రాత్రి, అసిస్టెంట్ సబ్‌ఇన్స్‌పెక్టర్ (ఏఎస్‌ఐ) తాన్య రాయ్ ఈ పింక్ పెట్రోల్ వ్యాన్‌లో విధుల్లో ఉన్నారు.

ఆమె షిఫ్ట్‌లో, ఆమె ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఏఎస్‌ఐ రాయ్ ఆ మహిళను కౌగిలించుకుని ముద్దాడారని చెబుతున్నారు.

"""/" / తాన్య రాయ్‌పై మద్యం అది ఒక రౌడీ లాగా ప్రవర్తించింది అని తెలిసే ఉన్నతాధికారులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు మహిళలను ఎంతవరకు రక్షిస్తున్నారనే దానిపై ఈ ఘటన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

తాన్య రాయ్ ఇంతకుముందే విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవించినందుకు విచారణ ఎదుర్కొంటున్నట్లు ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్( Pradhan Nagar Police Station ) తెలిపింది.

శిక్షగా ఆమెను తొలుత పోలీస్ లైన్‌కు బదిలీ చేశారు.అయితే, ఈ వారం ఆమె విధుల్లో చేరిన కొద్ది సేపటికే మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో ఆమెను వెంటనే సస్పెండ్ చేశారు.

ఒక మహిళకు ఒక మహిళా పోలీస్ నుంచి కూడా రక్షణ లేకపోతే ఎలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది పోలీసులు వ్యవస్థకు ఒక కళకం, మచ్చ తీసుకొచ్చింది అని చెప్పవచ్చు.

కండరాల బలహీనతకు కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మించాలి?