చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన గంగవ్వ..!!

గంగవ్వ( Gangavva ) అందరికీ సుపరిచితురాలే.బిగ్ బాస్ సీజన్( Bigg Boss4 ) ఫోర్ లో పోటీ చేసి మధ్యలోనే వచ్చేసింది.

ఈ షో ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యింది.గంగవ్వ మాటలకు, పాటలకు చాలామంది అభిమానులు ఉన్నారు.

అటువంటి గంగవ్వ టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నాయుడుకు క్షమాపణలు తెలియజేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.విషయంలోకి వెళ్తే తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజు తెలుగు ఛానల్ లో ప్రసారమైన కార్యక్రమంలో గంగవ్వ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులకు చెందిన వారి జాతకాలను చెప్పించడం జరిగింది.

"""/" / అయితే ఛానల్ ప్రతినిధి చంద్రబాబు, లోకేష్( Chandrababu, Lokesh ) ఫోటోలు చూపించగా.

ఆ నాయకుల జాతకం ఎలా ఉంటుందో చెప్పాలని కోరారు.దీంతో గంగవ్వ చంద్రబాబుకు గ్రహణం పట్టింది అని చెబుతోంది.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా గంగవ్వ వివరణ ఇస్తూ క్షమాపణలు తెలియజేసింది.

సదరు టీవీ ఛానల్ వాళ్లు అనమంటేనే తాను అన్నానని ఆ విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరడం జరిగింది.

తాజాగా ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వైరల్ చేయడం జరిగింది.

వీడియో: వేగంగా వెళ్తూ బైక్‌ పైనుంచి కింద పడ్డ అమ్మాయి.. గాయాలు చూస్తే!!