మెక్‌డొనాల్డ్స్ పార్కింగ్ స్థలంలో మగబిడ్డకు జన్మనిచ్చిన US మహిళ.. పేరు ఏం పెట్టిందంటే..
TeluguStop.com
సాధారణంగా తల్లులు తమ బిడ్డలకు ఆసుపత్రులలో జన్మనిస్తుంటారు కానీ ఒక్కోసారి డెలివరీ అర్జెంట్ అయిపోతుంది.
అందువల్ల ఊహించని ప్రదేశాల్లో ప్రసవం జరిగిపోతుంటుంది.అయితే కొందరు ఏ ప్రదేశంలో తమ పిల్లలకు జన్మనిచ్చారు ఆ ప్రదేశం పేరు కలిసేలా బిడ్డకు నామకరణం చేస్తుంటారు.
తాజాగా అమెరికాకు చెందిన ఒక తల్లి కూడా తన బిడ్డకు ఆ విధంగానే పేరు పెట్టింది.
వివరాల్లోకి వెళితే, ఇటీవల అనాలిసియా బెక్( Analicea Beck ), ఆమె భర్త డేనియల్( Daniel ) తల్లిదండ్రులు ఒక బిడ్డను ఎక్స్పెక్ట్ చేశారు.
అయితే వారికి ఓ పెద్ద సమస్య ఎదురైంది.వారు నివసించిన యూఎస్ఎలోని విస్కాన్సిన్లో( Wisconsin, USA ) చాలా ఘోరమైన మంచు తుఫాను వచ్చింది.
మంచు భారీగా కురుస్తోంది, రోడ్లు జారేవిగా మారాయి.అదే సమయంలో ప్రసవ నొప్పులు ఎక్కువయ్యాయి.
అనాలిసియా ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆమెను ఎక్కించుకొని భర్త ఆసుపత్రికి డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు.
మార్గం మధ్యలో కారు ఆపమని ఆమె డేనియల్‌కు చెప్పింది.వారు సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌ను చూసి అక్కడ తమ కారును పార్క్ చేశారు.
ఆమెకు వేరే మార్గం లేదు.కారులోనే బిడ్డను ప్రసవించాల్సి వచ్చింది.
"""/" /
డేనియల్ 911కి కాల్ చేసి సహాయం కోరాడు.అనాలిసియా కారు వెనుక సీటులోకి వెళ్లింది.
ఆమె గట్టిగా ముక్కి బిడ్డను కనింది.ఆరోగ్యంగా పండంటి మగ బిడ్డ పుట్టడంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఆలోపు వైద్యులు అక్కడికి చేరుకున్నారు.వారు బిడ్డకు సహాయం చేసారు.
బిడ్డ ఆరోగ్యంగా, బలంగా ఉందని డాక్టర్లు చెప్పారు.8 పౌండ్లు, 6 ఔన్సుల బరువు ఉన్నాడని తెలిపారు.
"""/" /
అయితే తల్లిదండ్రులు అతనికి లిటిల్ మెక్‌ఫ్లరీ ( Little McFlurry )అనే ఒక ఫన్నీ పేరు పెట్టారు.
వారు మెక్‌డొనాల్డ్స్ లో అమ్మే ఐస్ క్రీం డెజర్ట్ "మెక్‌ఫ్లరీ" నుంచి అతనికి ఈ పేరు పెట్టారు.
మెక్ఫ్లరీలో ఐస్ క్రీం, బిడ్డను కనేటప్పుడు ఉన్న బయట ఐస్ గురించి వారు ఆలోచించి ఈ పేరు పెట్టారు.
బిడ్డ సురక్షితంగా జన్మించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.ఫేస్బుక్లో ఈ ఘటన గురించి కూడా వారు పంచుకున్నారు.
అలసిపోయారా.. ఇక్కడ వెయిట్రెస్ ఒడిలో హాయిగా పడుకోవచ్చు.. 20 నిమిషాలకు రేటెంతంటే..!