సినిమాలో కనిపించే ఫుడ్ సర్వ్ చేస్తున్న యూఎస్ కంపెనీ..
TeluguStop.com
సాధారణంగా సినిమాల్లో కనిపించే ఫుడ్ చేసినప్పుడు మనకు వాటిని తినాలనిపిస్తుంది.కానీ ఆ ఫుడ్ ఏంటి, అదెక్కడ దొరుకుతుందనే వివరాలు మనకి అసలు తెలియదు.
అందువల్ల అవి చూసి ఆస్వాదించడం తప్ప తినే అవకాశం లభించదు.ఇది కొందరిని డిసప్పాయింట్ చేస్తుంది.
అయితే ఆ నిరాశ ఆడియన్స్ లో కలగకుండా ఉండేందుకు ఫోర్క్ ఎన్ ఫిల్మ్( Fork N Film ) అనే యుఎస్ కంపెనీ ఒక వినూత్న ఆలోచన చేసింది.
ఈ కంపెనీ సినిమాలోని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తూ, సినిమా చూసే అనుభవాన్ని అందిస్తుంది.
"""/" /
ఇది సినిమాల్లో చూపిన ఫుడ్ ఐటమ్స్ లాంటి వంటకాలను అందిస్తుంది, అవి తెరపై కనిపించే సమయంలోనే ఈ థియేటర్ సిబ్బంది ఫుడ్ తెచ్చి ఆడియన్స్ ముందు ఉంచుతారు.
ఈ విధంగా, అతిథులు సినిమాలలో కనిపించిన ప్రతి ఐటమ్ యాక్టర్స్ తో సహా రుచి చూడవచ్చు.
ఈ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ వారు ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది. """/" /
ఇటీవల, ఒక ఇన్‌స్టాగ్రామ్( Instagram ) అకౌంట్ ఫోర్క్ ఎన్ ఫిల్మ్ థియేటర్‌లో వేసిన "హోమ్ అలోన్( Home Alone ) స్క్రీనింగ్ వీడియోను పోస్ట్ చేసింది.
1990 సినిమాలో చూసిన ఆహార పదార్థాలను ప్రదర్శించిన తొమ్మిది-కోర్సుల భోజనానికి ప్రేక్షకులు ఎలా ఆదరించారో వీడియో చూపించింది.
వీడియో క్యాప్షన్‌లో "ఎప్పుడైనా సినిమాలో చూసిన ఫుడ్ ట్రై చేయాలని అనిపిస్తే, ఈ ఎక్స్‌పీరియన్స్ మీకోసమే!" అని రాశారు.
ఈ వీడియో వైరల్‌గా మారి 7 లక్షలకు పైగా లైక్‌లను అందుకుంది.చాలా మంది వ్యక్తులు ఈ ఐడియా బాగానే ఉందని కానీ సినిమాలో లాంటి ఫుడ్ ఈ కంపెనీ ప్రిపేర్ చేయగలుగుతుందా అని సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ కంపెనీ సరిగ్గా సినిమాలో కనిపించే వంటకాన్ని తయారు చేయలేదని, టేస్ట్ బాగుండదని ఇంకొందరు విమర్శించారు.
ఏదేమైనా ఈ క్రియేటివ్ ఐడియా తమకు నచ్చిందని కొందరు అన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
ఛీ.. ఛీ.. హాలోవీన్ వేడుకల్లో చేతివాటం చూపించిన మహిళ