మార్కెట్‌లోకి సరికొత్త ఫోన్ తీసుకురానున్న వన్‌ప్లస్

ప్రస్తుతం మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లు సందడి చేస్తున్నాయి.ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే శామ్‌సంగ్ సంస్థ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొచ్చేసింది.

మరికొన్ని కంపెనీలో అదే బాటలో పయనిస్తున్నాయి.ఈ తరుణంలో ప్రముఖ వన్ ప్లస్ సంస్థ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది.

దీనిపై సీఈవో పీట్ లా తాజాగా హింట్ ఇచ్చాడు.తమ కంపెనీ త్వరలో ఫోల్డబుల్ ఫోన్ తీసుకురానున్నట్లు ప్రకటించాడు.

అంతేకాకుండా ఫోల్డబుల్ ఫోన్ యొక్క మెటల్ బాడీని చూపించాడు.దీంతో వన్ ప్లస్ కంపెనీ తీసుకొచ్చే ఫోల్డబుల్ ఫోన్ కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

వన్ ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ తయారు చేస్తుందనే వదంతులు చాలా కాలంగా ఉన్నాయి.

తాజాగా సీఈవో చేసిన పోస్ట్‌తో అది మరింత బలపడింది.ఫోల్డబుల్ ఫోన్‌లు, మార్కెట్లోకి మొదటిసారి వచ్చినప్పటి నుండి, బడ్జెట్ స్పృహ ఉన్న వినియోగదారు దూరంగా ఉండే ప్రీమియం ఉత్పత్తులుగా తీసుకురాబడ్డాయి.

ప్రారంభంలో శామ్‌సంగ్, హువావే తమ ఫోల్డబుల్ ఫోన్‌లతో అగ్రగామిగా నిలిచాయి.త్వరలో షియోమి, హానర్, మైక్రోసాఫ్ట్, ఒప్పో వంటి ఇతర బ్రాండ్‌లు కూడా తమ ఫోల్డబుల్ ఫోన్‌లను తీసుకురానున్నాయి.

అయినప్పటికీ, శామ్ సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి.వన్‌ప్లస్ వారు ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నారో లేదో వెల్లడించనప్పటికీ, కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోందని ట్వీట్ సూచిస్తుంది.

ఇప్పటికే రెండు ఫ్లాగ్‌షిప్‌లను ప్రారంభించినందున వన్‌ప్లస్ దాని ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనుంది.

అయితే, ఇది ఈ సంవత్సరం కూడా విడుదల చేసే అవకాశం ఉంది.ఈ ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 12ఎల్-ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌తో రన్ అయ్యేలా తయారు చేయనుంది.

వన్ ప్లస్ ఫోల్డబుల్ ఫోన్, ఒప్పో ఫైండ్ ఎన్‌కు పోటీగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Mahesh Babu : మహేష్ బాబు తో రొమాన్స్ చేయనున్న స్టార్ హీరోయిన్…