ఇదెక్కడి విచిత్రం.. ప్రోగ్రాం ఆపట్లేదని ఆ టీవీ ఛానెల్ స్టాఫ్ ను కిడ్నాప్ చేశారట!

కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీలో కొన్ని విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి.చాలా వరకు కొన్ని ఘటనలు ఆశ్చర్యపరుస్తుంటాయి.

ఏదైనా సినిమా విషయంలోనో మరే ఇతర విషయంలోనూ ప్రేక్షకులు కొన్ని కొన్నిసార్లు ఆ సినిమాపై దుమారం రేపుతారు.

ఏదైనా సినిమా విడుదల కాకముందే ఆ సినిమా నుండి తమ మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నట్లయితే వెంటనే ఆ సినిమా విడుదలను ఆపే ప్రయత్నాలు చేస్తారు.

అలా ఇప్పటికీ ఇండస్ట్రీలలో చాలానే జరిగాయి.అంతేకాకుండా కొన్ని సినిమాల పై కేసులు కూడా వేస్తుంటారు.

అలా కొన్ని కొన్ని సార్లు చిన్న విషయాలు కాస్త పెద్దదిగా మారి వివాదానికి దారి తీస్తుంటాయి.

ఆ వివాదం కూడా పరిస్థితులు బట్టి మరింత ఎక్కువ అయ్యేలా ఉంటాయి కానీ తక్కువ అయ్యే పరిస్థితి మాత్రం అస్సలు కనిపించదు.

ఇక కేవలం సినిమాలే కాదు పలు బుల్లితెర షో లలో కూడా ఏవైనా మాటలు, చేష్టలు తమ మనోభావాలు దెబ్బతినేలా ఉంటే వెంటనే ఆ కార్యక్రమం చేసిన వాళ్లకి గట్టి కౌన్సిలింగ్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి.

ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇటువంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే ఓ సినీ ఇండస్ట్రీలో ఓ టీవీ ఛానల్ స్టాప్ చేయట్లేదని ఏకంగా కిడ్నాప్ చేశారట.

వినడానికి వింతగా ఉన్నా ఇది చాలా వరకు నిజం.ఎవరైనా టీవీ షో ఆపమని చెప్పినప్పుడు వినకపోతే గొడవలకు దిగుతారు లేదా పోలీసులకు కంప్లైంట్ చేస్తారు.

కానీ ఇదెక్కడి విడ్డూరం ఏకంగా కిడ్నాప్ చేశారా.మరి ఆ షోలో అంత ఏం జరిగింది.

అసలు పోలీస్ కేసు వేయకుండా ఎందుకు కిడ్నాప్ చేశారు ఇప్పుడు తెలుసుకుందాం.గతంలో ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లో 'వాయ్ మయే వెల్లుం' (నిజాయితీనే విజయం వరిస్తుంది) అనే కార్యక్రమం నిర్వహించారు.

ఇక ఇందులో భాగంగా అత్యాచారానికి గురైన ఓ యువతి పాల్గొనగా తనని ఈ స్థితికి తెచ్చిన వ్యక్తి గురించి చెప్పమన్నారు.

దీంతో ఆ టీవీ ఛానల్ కు చెందిన ఏడుగురిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది.

ఇక ఈ విషయాన్ని ప్రైవేట్ టీవీ ఛానల్ కు చెందిన సీనియర్ అధికారి అశోకన్ నగర పోలీసు కమిషనర్ జార్జ్ కు ఫిర్యాదు చేశారు.

తమ ఛానెల్ లో పని చేసే వసంతన్, గోపి, నోబెల్ తో పాటు మొత్తం ఏడుగురిని రాత్రి 8 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆ నిందితులను గుర్తించి వారి ఆధ్వర్యంలో ఉన్న తమ సిబ్బంది లను అప్పజెప్పాలని కోరారు.

ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని ఓ ముఠా తమని బెదిరించిందని వాళ్లు తమ సిబ్బందిని కిడ్నాప్ చేశారన్నా అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసును చేపట్టారు.అంతేకాకుండా బాధితుల కుటుంబాలను కంగారు పడవద్దు అని ధైర్యం ఇచ్చారు.

ఇక ఇదంతా గతంలో జరగగా ఆ సమయంలో ఈ ఘటనను చూసిన నెటిజన్లు షో స్టాప్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా.

ఇదెక్కడి విచిత్రం అంటూ ఆశ్చర్యపోయారు.

Telugu Producers : నాలుగైదు భాషల్లో సినిమాలను తెరకెక్కిస్తున్న తెలుగు నిర్మాతలు..అట్లుంటది మనతోని !