స్ట్రెచ్ మార్క్స్‌ను నివారించే ప‌సుపు..ఎలా వాడాలంటే?

స్ట్రెచ్ మార్క్స్‌ స్త్రీలు ప్ర‌స‌వం త‌ర్వాత ప్రాధానంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

బ‌రువు పెర‌గ‌డం కార‌ణంగా కూడా కొంద‌రిలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్ప‌డ‌తాయి.ఈ స్ట్రెచ్ మార్క్స్ కారణంగా చ‌ర్మం అంద‌హీనంగా మ‌రియు అస‌హ్యంగా క‌నిపిస్తుంది.

అందుకే వాటిని తొలిగించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీమ్స్‌, ఆయిల్స్ వాడుతుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే ప‌సుపు యూజ్ చేసి కూడా స్ట్రెచ్ మార్క్‌ను నివారించుకోవ‌చ్చు.

మ‌రి ప‌సుపు ఎలా వాడాలి? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆర్గానిక్ ప‌సుపు పొడి, ఒక స్పూన్ క‌ల‌బంద జెల్ మ‌రియు ఒక స్పూన్ రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట పూసిఇర‌వై, ముప్పై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే.క్ర‌మంగా స్ట్రెబ్ మార్క్స్ త‌గ్గిపోతాయి.

"""/"/ అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ ప‌సుపు పొడి, రెండు కొబ్బ‌రి నూనె వేసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత బాగా డ్రై అవ్వ‌నిచ్చి అప్పుడు చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజూ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ఇక ఒక బౌల్ లో ఒక స్పూన్ ప‌సుపు పొడి, ఎగ్ వైట్ వేసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోటు పూసి.పావు గంట పాటు అరనివ్వాలి.

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో చ‌ర్మాన్ని క్లీన్ చేసుకుని.మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేసిన కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

హీరోయిన్ జయసుధ ఇంటికి రోజుకి లీ. 25 పాలు ..ఎందు కోసం?