ఆ బీచ్ లోని ఇసుక కోసమే ప్రజలు అక్కడికి వెళ్తారట.. విశేషం ఏంటంటే?

మనం బీచ్ లకు వెళ్లి సరదాగా సమయం గడుపుతూ ఉంటాం.చాలా మందికి బీచ్ కు వెళ్లి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని హాయిగా సేదతీరాలని ఆశ పడుతూ ఉంటారు.

అలాగే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి బీచ్ లు పర్ఫెక్ట్ అనే చెప్పాలి.

అలా సెలవు రోజుల్లో సాయంత్రం సరదాగా కుటుంబం తో కలిసి వెళ్తే ఆ మజానే వేరు.

ఎవరమైన అలాగే బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తాము.కానీ ఈ బీచ్ లో మాత్రం ప్రజలు ఎంజాయ్ చెయ్యడానికి కాకుండా అక్కడ బీచ్ లోని ఇసుక కోసం వెళ్తారట.

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.అక్కడి ప్రజలు ఆ బీచ్ లో ఉన్న ఇసుక కోసం వెళ్తున్నారట.

అయితే అందుకు వాళ్ళు ఒక కారణం కూడా చెబుతున్నారు.ఇంతకీ ఏమిటా కారణం అని అనుకుంటున్నారా.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బీచ్ లు అన్నాక ఇసుక ఉండకుండా ఉంటుందా.

అలంటి బీచ్ లు ఎక్కడ ఉండవు.అయితే అన్ని బీచ్ ల కంటే ఈ బీచ్ లో ఉండే ఇసుక మాత్రం అక్కడి ప్రజలకు ప్రత్యేకమట.

ఇంతకీ ఆ బీచ్ ఎక్కడుందంటే.జపాన్ లోని ఇరుమోటే ఐలాండ్ లోని బీచ్ అన్నిటికంటే ప్రత్యేకంగా ఉంటుందట.

ఆ బీచ్ లో ఇసుక తెల్లటి రూపంలో లభ్యమవుతుందట. """/"/ ఆ బీచ్ లోకి వెళ్లే ప్రజలు చెప్పులు లేకుండా ఆ బీచ్ లో తిరుగుతారట.

అలా తిరిగిన తర్వాత వాళ్ళ కాళ్లకు అంటిన ఇసుకని జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్తారట.

కాళ్లకు అంటుకున్న ఇసుకను ఇంటికి తెచ్చుకుంటే అంత మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వాసం.

అందుకు ఒక కారణం కూడా ఉంది అని చెబుతున్నారు.అక్కడి బీచ్ లోని ఇసుక రేణువులు స్టార్ ఫిష్ ఆకారంలో ఉంటాయట.

"""/"/ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ప్రోటోజీవా సముద్రం నుండి కొట్టుకు వచ్చి ఇసుకలో కలిసి పోయాయట.

అవి మరణించిన తర్వాత వాటిపై ఉండే కాల్షియం పొరలు నీటి తాకిడికి అరిగిపోయి స్టార్ ఫిష్ ఆకారంలోకి మారిపోయాయని చెబుతున్నారు.

అందుకే ఈ బీచ్ లో ఎక్కడ చుసిన ఇలాంటి ఇసుక రేణువులే కనిపిస్తాయట.

ఈ ఇసుకను అక్కడి ప్రజలు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని భవిస్తారట.

దుండగుడి దాడిలో చావు అంచుల దాకా .. హత్యాయత్నంపై పుస్తకంలో వివరించిన సల్మాన్ రష్డీ