పెళ్లి పత్రికల వరకైతే మా ప్రేమ చేరింది..కానీ ఇంతలో 'శశి'కి జాబ్ వచ్చేసరికి అనుకోని సంఘటన ఎదురైంది..

"ప్రేమకు చిరునామా" A Story Written By: Sainath G ప్రతి పది మందిలో ఒకడి లైఫ్ లో లవ్ స్టోరీ ఉంటుంది.

ప్రతి వంద మందిలో ఒకడు ప్రేమించిన అమ్మాయికి లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు…ప్రతి వెయ్యి మందిలో ఒకడికి అమ్మాయి లవ్ ని ఆక్సెప్ట్ చేస్తుంది… కానీ లక్షలో ఒకడు మాత్రమే ప్రేమను పెళ్లి పీటల దాకా తీస్కెళ్ళగలుగుతాడు …ప్రేమించడం అంటే ప్రేమను పంచడం మాత్రమే …ప్రేమను తిరిగి ఆశించడం కాదు … ప్రేమ గురించి ఈ రేంజ్ లో పొయెట్రి చెప్పింది ప్రేమలో పడ్డ ఒక యువకుడు …మరి అతని కథ, ప్రేమను అమ్మాయికి వ్యక్త పరిచడం వరకే వెళ్ళిందా లేక పెళ్లి పీటల దాకావెళ్ళిందా అనేది అతని మాటల్లో వింటేనే బాగుంటుంది… Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ నా పేరు సూర్యకాంత్.

అందరు సూర్య అని పిలుస్తుంటారు .హైదరాబాద్ లో ఎన్నో మిడిల్క్లాస్ ఫ్యామిలీస్ లో మాది ఒకటి.

ప్రేమ గురించి నేను చెప్పడానికి కారణం నేనొకఅమ్మాయిని ప్రేమించడం.అయిదేళ్ళ క్రితం మా ఇంటి బాల్కనీ లో ఈ కథ మొదలైంది .

ఆ రోజే మొట్టమొదటి సారిగా నా కలల యువరాని దర్శనమిచ్చింది .రేపు నా బీ .

టెక్ కాలేజ్స్టార్ట్ అని కాలేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ నేను బాల్కనీ లో తిరుగుతూ ఉండగా మా ఇంటి ముందు నుండి వెళుతున్న ఒక అమ్మాయిని చూశాను.

ఆ అమ్మాయిఎవరో నాకు తెలీదు .కనీసం తన పేరు ఏంటో కూడా తెలీదు .

తర్వాత షాపింగ్ కోసం అనిబయటకి వెళ్ళాను.అక్కడ షాపింగ్ మాల్ మెట్ల మీద నుండి దిగి వస్తు అదే అమ్మాయి మళ్లీకనిపించింది .

ఎగసి పడే అల నేనైతే నాకోసం దిగి వస్తున్న ఆకాశం లాగా కనిపించిందినాకు.

ఆ క్షణం నేను దేవుడిని కోరుకుంది ఒక్కటే, ఈ అమ్మాయిని మళ్లీ నాకు కనిపించేలామాత్రం చేయకు .

ఎందుకంటే లవ్ కి, లవ్ స్టోరీస్ కి నేను చాలా దూరంగా ఉంటే .

కానీతనని చూస్తే మాత్రం ఎందుకు ప్రేమించానో తెలియకుండా ప్రేమించేయాలి అనిపిస్తుంది.రేపు కాలేజ్ ఫర్స్ట్ డే అనే ఎగ్సైట్మెంట్ కంటే ఎక్కువగా నా ఊహల్లో అమ్మాయినిండిపోయింది.

మరుసటి రోజు కాలేజ్ కి వెళ్ళా .నా అదృష్టం బాగుందని చెప్పాలో లేక దేవుడుకరుణించాడని చెప్పాలో తెలీదు.

నిన్న కలలోకి మాత్రమే పరిమితం అనుకున్న అమ్మాయిమరొకసారి కనులకు ఎదురుగా కనిపించింది.అమ్మాయిలతో మాట్లాడడం అలవాటు లేనినేను ఆ అమ్మాయి మాట్లాడాలని కూడా ఆలోచించలేదు .

కానీ ఎందుకో తన గురించితెలుసుకోవాలి, తన పేరు ఏంటో తెలుసుకోవాలి అని అనిపించింది .

ఈ లోపే క్లాస్ కివచ్చిన లెక్చరర్ ఆ అమ్మాయిని క్లాస్ కి పరిచయం చేసుకో అనడం తో “నా పేరు శశిరేఖ “అని చెప్పింది .

సూర్య శశి, రెండు పేరులకి బిన్నత్వము ఎక్కువ అయినప్పటికీ రెండు ఒకే ఆకాశం నీడలోఉంటాయి.

నా ప్రేమ కూడా అదే ఆకాశం లాంటిది అని అనిపించింది .అదే రోజుసాయంత్రం ఇంటికి వెళుతుండగా ఒక ఇంటి ముందు శశి స్కూటీ కనిపించింది.

అప్పుడేతెలిసింది అదే శశి వాళ్ళ ఇల్లు అని.అమ్మాయి మామూలుగా ఉంటేనే అబ్బాయిలఫాలోయింగ్ని ఆపలేము .

అలాంటిది ఏంజల్ లాగా ఉన్న శశి ఫాలోయింగ్ గురించి కొత్తగాచెప్పనవసరం లేదు.ఆధర్ కార్డ్ లో లేని డీటేల్స్ కూడా ఈసీ గా కలెక్ట్ చేసేస్తారు .

శశి వాళ్ళఫాదర్ కి రీసెంట్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది.అందుకే ఈ ఇంట్లో కొత్తగా అద్దెకుదిగారు అని నా ఫ్రెండ్ చెపితే తెలుసుకున్నాను .

చదవడం కంటే ఎక్కువగా తన ఊహలతోనే కాలం గడిపేస్తు మౌనంగా ప్రేమించేస్తూఉండగానే సెమిస్టర్ ఎగ్స్యామ్స్ కూడా వచ్చేసాయి.

ఎగ్స్యామ్స్ అయిపోయాక హాలిడేస్ లో శశివాళ్ళ అమమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అని తెలిసింది .

తనని చూడకుండాఉండగలనా లేదా అనే బయం వేసింది నాకు.కాటుక దిద్దిన రాతిరిలో ప్రయాణం లాగాఅనిపించింది నా జీవితం శశి కనిపించని కొన్ని రోజులు.

క్షణం ఒక యుగం లాగా గడిచింది.!--nextpage బాద అయినా సంతోషమైనా కొంత కాలమే ఉంటుంది కదా.

ఈ లోపు శశి ఊరి నుండివచ్చేసింది.కాలేజ్ రిఓపెన్ అయ్యింది .

చాలా రోజుల తరవాత శశి ని చూసాను .బహుశాచాలా రోజులకీ చూడటం వల్లనో తెలీదు కానీ ఇంతక ముందు కంటే ఎంతో చూడ చక్కగాకనిపించింది .

అదే రోజు వర్షం పడటం, తాను నాకు ఇష్టమయిన వైట్ డ్రెస్ వేసుకోదం, కుడిచేయితో తన కంటిపై పడుతున్న కురులని సడుర్కుంటూ ఉంటే చూడటం వల్ల తనఅందం మరింతగా పెరిగింది ఏమో అని అనిపించింది .

ఇది ఆకర్షణ అని నాకు తెలుసు .కానీ ప్రేమకి మొదటి పునాది ఆకర్షణనే కదా .

మౌనంగాఎంత ప్రేమించావు అనే దానికంటే అమ్మాయికి ఎక్స్ ప్రెస్ చేయడం ముక్యమని నాస్నేహితులు చెప్పే సరికి ధైర్యం చేసి తనకి నా ప్రేమ విషయం చెప్పేసా.

కాకపోతే అందరిఅబ్బాయిల లాగానే ప్రేమించిన అమ్మాయితో భయపడుతు, తడబడుతు ప్రేమ విషయంచెప్పా.తను ఏం చెప్పకుండా వెళ్లిపోయింది .

అంతే లే అప్పటి వరకు మాట్లాడని నేనుసడన్ గా వెళ్లి ఈ లవ్ యూ అని చెపితే రియాక్షన్ ఇలాగే ఉంటుంది కదా .

కాలంకి వేగం ఎక్కువ .కన్నీటికి కాలం కంటే వేగం ఎక్కువ .

బాదకి దగ్గర బాందువు నిఅయిపోయా .ఏ లోపే ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ బిసీ స్టార్ట్ అయ్యింది.

శశి కి ఒక టాప్ఎమ్.ఎన్.

సి లో జాబ్ వచింది .నాకు స్టార్ట్ అప్ కంపనీలో జాబ్ వచ్చింది .

చిత్రమో లేకఎదకి చైత్రమో తెలీదు కానీ ఫేర్ వెల్ రోజున శశి “ ఐ టూ లవ్ యూ“ అని చెప్పింది .

ఇన్ని రోజులు స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదని నీ లవ్ ఆక్సెప్ట్ చేయలేదు అని చెప్పింది.

లవ్అనేది ఒక ఫీలింగ్ .ఆది ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో తెలీదు .

తను నా లవ్ఆక్సెప్ట్ చేయగానే ఈ వరల్డ్ లో నేనే అందరికంటె లక్కీఎస్ట్, హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకున్నా .

ఎగ్స్యామ్స్ అయిపోయాయి .కాలేజ్ కి వీడుకోలు చెప్పేసిన తరవాత జాబ్ ఆఫర్ లెటర్రావడానికి టైమ్ పట్టింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ నాకు హైదరాబాద్ లో పోస్టింగ్ వచ్చింది అని అదృష్టంగా భావించాలో లేక శశికిబెంగళూరులో పోస్టింగ్ వచ్చిందని దురదృష్టంగా భావించాలో అర్థం కాలేదు.

మయ ప్రేమవిషయం ఇద్దరి ఇంట్లో చెప్పాము .మా ఇద్దరి పేరెంట్స్ మా పెళ్ళికి ఒప్పుకున్నారు .

ఇకజీవితం లో నేను సాధించడానికి ఇంకేం లేదు అనుకున్నా .జాబ్ లో జాయిన్ అయ్యేందుకుబెంగళూరు వెళుతున్న శశికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్ కి వెల్లా.

తను నన్నుచివరి సారిగా చూసిన చూపు ఇప్పటికీ మరచిపోలేను.ప్రేమ మాటల్లో కంటే కంటి చూపులో ఎక్కువ కనబడుతుంది .

ప్రేమకి మౌన భావాలేఎక్కువ కదా.ఈలోగా రైలు కదిలింది .

నా మనసు నా నుండి దూరంగా వెళుతునట్టుఅనిపించింది .నేను కూడా జాబ్ లో జాయిన్ అయ్యాను.

పగలంతా ఆఫీస్ పని, రాతిరిఅయితే శశి తో వాట్స్ యాప్ చాటింగ్.మనుషులు మాత్రమే దూరంగా ఉన్నాము మనసులుమాత్రం దగ్గరే ఉన్నాయి.

దూరం మమ్మల్ని ఇంకా దగ్గర చేస్తూనే ఉంది.ఇలా రోజు ఫోన్ లోమాట్లాడడం చాట్ చేసుకోవడంతో రెండు సంవత్సరాలు గడిచిపోయింది.

మా పేరెంట్స్ మాపెళ్ళికి ఒప్పుకున్నారు కాబట్టి మా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది .

ఎంగేజ్మెంట్కి పెళ్లికి మూడునెలలు గడువు ఉండటం తో తను మళ్లీ బెంగళూరు వెళ్లిపోయింది .

ప్రేమించిన అమ్మాయి తో పెళ్లి జరగడం కంటే సంతోషం ఇంకేం ఉంటుంది .

ఒక మనిషిసంతోషంగా ఎక్కువ రోజులు ఉంటే కాలం ఒరవలేదు అనుకుంటా.అందుకే ఏదో ఒక రూపంలో ప్రాబ్లమ్ని తీసుకువస్తుంది .

పెళ్లి పత్రిక డిసైన్ ఫైనల్ చేయడం కోసం కాల్ చేస్తే శశికాల్ లిఫ్ట్ చేయలేదు.

తరవాత నుండి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది .ఏమైందోతెలీదు.

నమ్మలేని ఓ చేదు నిజం నాకు ఎదురైంది .శశి సూసైడ్ చేసుకుంది అనే షాకింగ్న్యూస్ తెలిసింది .

నా ప్రేమ పెళ్లి పత్రికల నుండి పెళ్లి పీటల దాకా వెళ్లాలేకపోయింది .

ఏడు సంవత్సరాల ప్రేమ ఏడు అడుగులు వేయలేకపోయింది .సూర్య అని పేరు మాత్రమేఉంది, వేకువ మాత్రం నాకు లేకుండా నిషి రాతిరిలోకి తోసి ఒంటరిగా నను శశి వదిలివెళ్లిపోయిదీ .

తను ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎవ్వరికి తెలీదు .నా లోకమంతా శోకసంద్రమయ్యింది .

కానీ నా వల్ల ఇంట్లో వాళ్ళు బాధ పడకూడదని బాదని నాలోనే దాచుకునికన్నీళ్ళ రూపంలో నా కనుల నిండా శశి రూపం నింపుకున్నా .

ఇప్పటికీ నేను తననిప్రేమిస్తూనే ఉన్నా.ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడమే కదా.

ఇవ్వడం లోనే ఎంతోసంతోషం ఉంది.తన ప్రేమ పొందాలని ఆశించడం నా మూర్కత్వం కదా.

అందుకేఅమాయకంగా తన ఊహలతో కాలం గడిపేస్తున్నా .అయిన నేను చాలా సంతోషంగా ఉన్నా .

ఇది అర్థం కావాలి అంటే మీ లైఫ్ లో కూడా లవ్ కి చోటు ఉండి ఉండాలి .

A Story Written By: Sainath Gopi Contact: 7386587386 Fb Id: Fb!--com/saigopi777.

ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల బరిలో భారత సంతతి మహిళా డాక్టర్