విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు మళ్లీ బ్రేక్

స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో విచారణకు ఏసీబీ కోర్టు మరోసారి విరామం ప్రకటించిందని తెలుస్తోంది.కోర్టు హాలులో ఇరు పక్షాలకు చెందిన వారు సుమారు రెండు వందల మంది ఉండటంతో న్యాయమూర్తి బ్రేక్ ఇచ్చారని సమాచారం.

సీఐడీ, చంద్రబాబు తరపున కేవలం 15 మంది మాత్రమే న్యాయస్థానం లోపల ఉండాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

బ్రేక్ అనంతరం కేసుపై జడ్జి మరోసారి వాదనలు వినే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు కోర్టు వద్ద హై అలర్ట్ జారీ చేసిన పోలీసులు భారీగా మోహరించారు.

నీటి కోసం వెళ్లిన సింహానికి మొసలి ఊహించని షాక్.. వీడియో వైరల్..