తెలంగాణలో స్వచ్చంధ లాక్‌డౌన్‌కు సిద్దం అవుతున్న పట్టణం.. ఏదంటే.. ?

మళ్లీ గత సంవత్సరం రోజులను తలపిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు.

కాగా కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో జిల్లాలో ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో జిల్లా ప్రజలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇలా రోజుకు వందల వరకు కేసులు నమోదు అవుతుండడంతో మరోసారి లాక్ డౌన్ అంశం ప్రస్తుతం తెరపైకి తెస్తున్నారు.

ఈ క్రమంలో కామారెడ్డి పట్టణంలో మరోసారి కరోనా కట్టడిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో రాజకీయ, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, జెఎసి నాయకులు ఈ నెల 19 న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారట.

కాగా గతంలో కరోనా మొదటి వేవ్ సమయంలో అమలు చేసిన విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట.

లేదా కామారెడ్డి లో స్వచ్చంధంగా లాక్‌డౌన్ వైపు కూడా అడుగులుపడిన ఆశ్చర్య పోనవసరం లేదని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.

బీజేపీ నేతలకు విలువలు లేవు..: జగ్గారెడ్డి