మా ఆయన్ని ఆ హీరోయినే హత్య చేయించింది: సీనియర్ నటి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఇండస్ట్రీలో సుమారు 200కు పైగా చిత్రాలలో నటిగా సహాయ నటిగా నటించి ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న నటి కృష్ణవేణి గురించి అందరికీ సుపరిచితమే.
ఈమె 1979 నగ్నసత్యం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఇలా ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె వారాలబ్బాయి సినిమా దర్శకుడు రాజచంద్రను వివాహం చేసుకున్నారు.
ఇలా ప్రస్తుతం పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న కృష్ణవేణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు.
తన ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమయంలో డైరెక్టర్ రాజాచంద్రను వివాహ చేసుకున్నట్లు వెల్లడించారు.
అయితే అప్పటికే అతనికి వివాహం జరిగి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని ఈ సందర్భంగా కృష్ణవేణి తన భర్త గురించి తెలియజేశారు.
అయితే అప్పుడు వీరికి కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించడానికి డబ్బులు లేకుండా ఉండేవని ఆమె తెలిపారు.
ఈ విధంగా తనని పెళ్లి చేసుకున్న తర్వాత అతను దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు.
ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు 100 రోజులు ఆడటం వల్ల ఈయనకు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ఈ విధంగా తన భర్త ఒక సినిమాకు 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగినట్లు కృష్ణవేణి తెలియజేశారు.
"""/"/
ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఈయనని చూసి ఇండస్ట్రీ ఓర్వలేక పోయింది.
ఇలా మా ఇద్దరి పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలకి ఆయన చనిపోయారని ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
నిజం చెప్పాలంటే చనిపోయారు అనడం కన్నా చంపేశారని చెప్పడం సరిగ్గా సరిపోతుందని కృష్ణవేణి వెల్లడించారు.
ఇండస్ట్రీలో దర్శకుడిగా అతని గెలుపును చూసి ఓర్వలేని ఒక హీరోయిన్ తనని హత్య చేయించిందని కృష్ణవేణి ఈ సందర్భంగా తన భర్త గురించి వెల్లడించారు.
ఆ హీరోయిన్ దారుణంగా తన భర్తని కరెంటు వైర్లతో కాల్చి హత్య చేయించిందని ఆమె ఎవరో కూడా తనకు తెలుసని నటి కృష్ణవేణి వెల్లడించారు.
"""/"/
అయితే తన భర్త హత్య గురించి అప్పట్లో పోలీసులకు కూడా ప్రతి ఒక్క విషయం తెలుసు.
స్వయంగా పోలీసులే ఈ హత్య చేసింది ఎవరో కూడా మాకు తెలుసు అయినా మేము తనని ఏమి చేయలేక పోతున్నాము అంటూ పోలీసులు తెలిపినట్లు నటి కృష్ణవేణి ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ విధంగా ఆనటి తన భర్తను చంపడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరించారని అయితే మా కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలియడంతో పోలీసులు రెండు సంవత్సరాల పాటు తన ఇంటి చుట్టూ ఉన్నారని పోలీసులు ఆ సమయంలో తనకు రక్షణ ఇచ్చారని నటి తన వ్యక్తిగత విషయాల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ విధంగా ప్రస్తుత సినిమాల గురించి తన వ్యక్తిగత విషయాల గురించి ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన ఈమె తన భర్తను హత్య చేయించింది ఒక హీరోయిన్ అని చెప్పినప్పటికీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.
చాపకింద నీరులా హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. భారత్‌లో 18కి చేరిన రోగుల సంఖ్య