అతి తొందరలో తెరమరుగు కాబోతున్న యంగ్ హీరోలు

ఒకప్పుడు తమ సినిమాలతో వెలుగు వెలిగిన హీరోలు ప్రస్తుతం తెరమరుగయ్యేందుకు రెడీ అవుతున్నారు.

తొలి సినిమాలతో మంచి పేరు పొందినా.ఆ తర్వాత సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేయడంతో ఫ్లాపులు చవిచూశారు.

ఆ దెబ్బతో సినిమాల నుంచే దూరం అయ్యే పరిస్థితి తలెత్తింది.ప్రస్తుతం తెరమరుగు అయ్యే స్థితిలో ఉన్న యంగ్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleమంచు విష్ణు/h3p """/" / డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు మంచు విష్ణు.

పలు హిట్ సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం తెరమరుగయ్యే స్థితిలో ఉన్నాడు.2007 లో ఢీ సినిమా ద్వారా విష్ణు హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

ఈ సినిమా హిట్ కావడంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఆ తర్వాత కొన్ని సినిమాలు విజయవంతం అయినా.

వరుసగా ఫ్లాఫులు రావడంతో ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.ఇప్పటి వరకు తన కెరీర్ లో పాతిక సినిమాల వరకు చేశాడు.

H3 Class=subheader-styleమంచు మనోజ్/h3p """/" / ఈయన కూడా మోహన్ బాబు వారసుడిగానే సినిమాల్లోకి వచ్చాడు.

తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో బాల నటుడిగా చేశాడు.2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.

బిందాస్ సినిమాకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.

ఇప్పటి వరకు సుమారు 25 సినిమాలు చేశాడు మనోజ్.h3 Class=subheader-styleకార్తికేయ/h3p """/" / అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు కార్తికేయ.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మంచి క్రేజ్ వచ్చింది.ఆ తర్వాత కార్తికేయకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

హిప్పి , గుణ 369 , 90 ఎంఎల్ సినిమాల్లో నటించాడు.కానీ ఈ మూడు సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి.

కార్తికేయ చివరి సినిమా చావు కబురు చల్లగా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

దీందో ఆయనను ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు.h3 Class=subheader-styleఆది/h3p """/" / ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు సాయి కుమార్ కుమారుడు ఆది.

2011 లో కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో ఆది వెండితెరకు పరిచయమయ్యాడు.

ఈ సినిమా హిట్ కావడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది.2011 లో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు.

అనంతరం బి.జయ దర్శకత్వంలో వచ్చిన లవ్‌లీ సినిమాలో నటించాడు.

ఈ సినిమా కూడా మంచి పేరు తెచ్చింది.ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు.

H3 Class=subheader-styleవరుణ్ సందేశ్/h3p """/" / వరుణ్ సందేశ్ శేఖర్ కమ్ముల సినిమా హ్యాపీడేస్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి.ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.

బిగ్ బాస్ లో కంటెస్టెంగ్ గా ఎంట్రీ ఇచ్చినా.పెద్దగా పేరు రాలేదు.

కెరీర్ లో 25 సినిమాలు చేసిన వరుణ్ కు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు.

H3 Class=subheader-styleరాజ్ తరుణ్/h3p """/" / ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రాజ్ తరుణ్.

ఇప్పటి వరకు మొత్తం 15 సినిమాలు చేశాడు.సినిమాల్లోకి రాకముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు.

వాటి ద్వారా వచ్చిన పేరుతోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం ఆయనకు ఎలాంటి అవకాశాలు రావడం లేదు.

కళ్లు చెదిరే ఫీచర్లతో బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ ఎప్పుడంటే..?