మహిళా రిజర్వేషన్ బిల్లు ఆ ముగ్గురు ఎంపీలకు నచ్చలేదా..?

దేశంలోనే చరిత్రత్మకమైనటువంటి బిల్లు బిజెపి( BJP ) హయాంలో ఆమోదం పొందింది.

గత 28 సంవత్సరాల నుంచి ఈ బిల్లు ఆమోదం కోసం దేశవ్యాప్తంగా మహిళామణులు ఎదురుచూస్తున్నారు.

అలాంటి చరిత్రత్మక ఘట్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ( Womens Reservation Bill ) కు సంబంధించి ఓటింగ్ ను తెలంగాణ ముగ్గురు ఎంపీలు బహిష్కరించారని తెలుస్తోంది.

మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ముగ్గురు మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయం దాకా అక్కడే ఉండి సరిగ్గా ఓటింగ్ జరిగే సమయంలోనే సభ నుంచి వెళ్లిపోయారట.

"""/" / అంటే బిల్లును వారు కావాలనే బహిష్కరించినట్టు అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దీన్ని బట్టి చూస్తే 33 శాతం మహిళా రిజర్వేషన్ రావడం వాళ్లకి ఇష్టం లేదని అర్థమవుతుంది.

19వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఓటింగ్ నిర్వహించారు.

అదేరోజు సాయంత్రం 5.30 గంటల నుంచి ఏఐసీసీ కార్యాలయంలో మాణిక ఠాగూర్ ( Manickam Tagoure ) రూమ్ లో వెయిట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బెల్లయ్య నాయక్,మాజీ మంత్రి వినోద్ ఉన్నారట.

"""/" / సాయంత్రం 6.30 గంటలకు కాంగ్రెస్ వార్ రూమ్ కి వెళ్ళిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) .

అంటే ఓటింగ్ సమయంలో వారు సభలో లేరని అర్థమవుతుంది.కేవలం రేవంత్ రెడ్డి కాకుండా ఉత్తంకుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) , కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఓటింగ్ లో పాల్గొనలేదని సోషల్ మీడియాలో వార్తలు అనేకం వినిపిస్తున్నాయి.

దీంతో బిఆర్ఎస్ నేతలు స్పందించి మహిళా సాధికారత కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదని, అందుకే వారు ఓటింగ్ లో పాల్గొనలేదని, రాబోవు ఎన్నికల్లో ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని పలు రకాలుగా ఎద్దేవా చేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ తన కథలను వేరేవాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మంచిదా..?