వర్షం కారణంగా మూడో టీ20 మ్యాచ్ రద్దు.. సిరీస్ గెలిచిన భారత్..!
TeluguStop.com
భారత్-ఐర్లాండ్( India-Ireland ) మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్( T20 Match ) వర్షం కారణంగా రద్దయింది.
ఈ మ్యాచ్లో గెలిచి భారత్ క్లీన్ స్వీప్ చేయాలనుకుంది.మరొక పక్క ఐర్లాండ్ ఈ మ్యాచ్ గెలిచి తమ పరువు నిలుపుకోవాలని భావించింది.
కానీ ఉదయం నుంచి వాన దంచి కొట్టడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది.
కాసేపట్లో మ్యాచ్ మొదలయ్యే సమయానికి వర్షం ప్రారంభమైంది.ఎంతసేపు ఎదురుచూసిన వర్షం తగ్గకపోవడం వల్ల కనీసం టాస్ వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
దీంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. """/" /
మ్యాచ్ ను వీక్షించాలనుకున్న అభిమానులు వర్షం తగ్గాక ఆలస్యం అయినా కూడా మ్యాచ్ జరుగుతుంది అని భావించారు.
అంపైర్లు కూడా పలుమార్లు మైదానాన్ని పరిశీలించి ఆటకు అనుకూలంగా లేదని ప్రకటించడంతో మ్యాచ్ అధికారికంగా రద్దయింది.
దీంతో భారత క్రికెట్ అభిమానులతో పాటు ఐర్లాండ్ క్రికెట్ అభిమానుల ఆశలపై వర్షం నీళ్లు గుమ్మరించింది.
"""/" /
ఈ సీరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంతో ఉండడంవల్ల టీ20 సిరీస్ ను భారత్ స్వంతం చేసుకుంది.
ఈ సిరీస్ తొలి మ్యాచ్లో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్( Duckworth Lewis ) పద్ధతిలో భారత్ విజయం సాధించింది.
రెండో మ్యాచ్లో భారత్ తన సత్తాను చూపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
చైనా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ లో భారత్ ద్వితీయ శ్రేణి బలగంతో బరిలోకి దిగనుంది.
ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు రుతురాజు గైక్వాడ్ సారథ్యం వహించనున్నాడు.
కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?