టీఆర్ఎస్‎కు మొదలైన జంపింగ్‎ల టెన్షన్..

రాష్ట్రంలో జంపింగ్ ల రాజకీయం జోరుగా సాగుతోంది.ఆపరేషన్ ఆకర్ష పేరుతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు.

టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.

పార్టీని బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నాయి.బీజేపీ నుంచి ఈటల.

కాంగ్రెస్ నుంచి జానారెడ్డి ఆయా బాధ్యతలను భుజాన వేసుకోవడంతో.టీఆర్ఎస్ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారుతున్నాయి.అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులను తమ పార్టీ వైపు ఆకర్షించేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ లో ఈ పనిని మాజీ మంత్రి జానారెడ్డి తన భుజాల మీద వేసుకున్నారు.

అధికార పార్టీకి షాక్ ఇవ్వడానికి ఏకంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లకు తెరలేపారు.

బడంగ్ పేటలో టీఆర్ఎస్ కు చెందిన మేయర్ ను.కార్పోరేటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకున్నారు.

వాళ్లను తీసుకు వెళ్లి రాహుల్ సమక్షంలో కండువాలు కప్పేశారు.ఇక జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత జోరు మీదున్న బీజేపీ.

అదే పంథాలో సాగుతోంది.పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి కేంద్ర మంత్రలకు బాధ్యతలు అప్పగించారు.

అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులను.పార్టీ కోసం పనిచేసిన వారిని, ఉద్యమనాయకులను పార్టీలో చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్రకు చేరికల సమన్వయ కర్త కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు.

టీఆర్ఎస్ లో ఆదరణ కోల్పోయిన నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకోవడం, బీజేపీ నేతలను సమన్వయం చేయడం కోసం ఆయన్ను నియమిస్తూ.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. """/" / రాబోయే ఎన్నికల్లో సీట్ల విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంటున్నట్టు వార్తలు వస్తుండటంతో.

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది.ఈ నివేదికలో దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేక పోవడంతో.

వారంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టే తెలుస్తోంది.అధికారంలోకి వచ్చిన వెంటనే.

అన్ని పార్టీల మాజీలను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడంతో.అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి.

ఈ వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.కొల్లాపూర్ లో తాజా ఎమ్మెల్యే హర్శ వర్థన్ రెడ్డికి.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కి మధ్య మాటల యుద్దం ప్రత్యక్ష దాడుల వరకూ వెళ్లింది.

ఇలా చాలా నియోజక వర్గాల్లో నడుస్తోంది.ఇవన్నీ అధికార పక్షానికి నిద్ర రాకుండా చేస్తున్నాయి.

ఇలా అధికార పక్షంపై గుర్రుగా ఉన్న నేతలను పార్టీలోకి చేర్చుకుంటే ఎంతో కొంత కలిసి వస్తుందనేది రాజకీయ నాయకుల అంచనా.

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలను సైతం తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ పాదయాత్ర మొదలు పెట్టింది.

దానికి తోడు నెలకోసారి పెద్ద నాయకులతో మీటింగ్ లు పెడుతోంది.దాంతో బీజేపీ పిలవక పోయిన చాలా మంది నేతలు స్వచ్చందంగా పార్లీలో చేరుతున్నారు.

తాజాగా మాజీ మంత్రి కొండావిశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోచేరారు.దాంతో పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

"""/" / ఇక ఆపరేషన్ ఆకర్ష్ మొదలైన దగ్గరినుంచి గులాబి నేతల్లో గుబులు మొదలైంది.

పార్టీలో నేతలు ఒక్కొక్కరిగా జారిపోతుంటే.టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది.

పార్టీని వీడుతున్న వారిపై ఫోకస్ పెట్టినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు.తెలంగాణలో భారీగా విస్తరిస్తున్న బీజేపీ కండువా కప్పుకోవడానికి టీఆర్ఎస్ నేతలు క్యూకడుతున్నట్టు తెలుస్తోంది.

పార్టీకి నష్ఠం లేని నాయకులను ఎంచుకుని పార్టీలో చేర్చుకునేలా అధిష్ఠానం సూచనలు వచ్చాయని సమాచారం.

మొత్తానికి ఎన్నికల కంటే ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్నది మాత్రం వాస్తవం.

పార్టీల ఫిరాయింపుతో కోలాహలంగా మారిన తెలంగాణలో ఎవరికి వారు తమదే అధికారం అంటూ బీరాలకు పోతున్నారు.

అయితే రాబోయే ఎన్నికలు కొంత బీజేపీకి అనుకూలంగా ఉన్నాయనే నివేదికలు టీఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

చూడాలి మరి ఈ జంపింగ్ ల రాజకీయానికి అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఫుల్ స్టాప్ పెడతాయో.

వీడియో వైరల్: శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..