ఓ టెన్షన్ తీరింది.. టూర్లు చెక్కేస్తున్న నాయకులు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ( General Election Polling )ప్రక్రియ ముగియడంతో, ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నాయకులంతా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు .

ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ వరకు వెలువడే అవకాశం లేకపోవడంతో,  అప్పటి వరకు కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనేక ప్రాంతాలకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వెళ్తున్నారు.

కొంతమంది విదేశాలకు వెళుతుండగా,  మరి కొంతమంది నేతలు హైదరాబాద్,  కొడైకెనాల్,  ఊటీ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.

కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తూ కుటుంబ సభ్యులతో రిలాక్స్ అవుతున్నారు.పోలింగ్ ముగిసిన తరువాత కూడా తమ ఇళ్ళ వద్ద కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉండడం, ఖర్చు కూడా తడిసి మోపుడు అవుతుండడంతో , వీటిని తట్టుకోలేక చాలామంది సొంత నియోజకవర్గాలను వదిలిపెట్టి విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు.

"""/" /   వైసిపి అధినేత జగన్( CM YS Jagan ) సైతం కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్తున్నారు.

ఇప్పటి వరకు ఎన్నికల తతంగం లో బిజీబిజీగా నాయకులు గడిపారు.  ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చాలా నెలలుగా టెన్షన్ వాతావరణంలోనే ఉన్నారు.

"""/" / మళ్ళీ టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్ ఒకవైపు , టికెట్ ఖరారైన బి ఫారం చేతికి అందే వరకు మరో టెన్షన్ నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా పూర్తవుతుందా లేదా అనే టెన్షన్,  టికెట్ వచ్చిన తర్వాత పార్టీలోని అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవడం, నియోజకవర్గ ప్రజలు తమ బలం పెంచుకునేందుకు రకరకాల మార్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఎన్నికల ప్రచారానికి జన సమీకరణ చేపట్టడం , ఎన్నికల్లో డబ్బుల పంపిణీ వ్యవహారాలు ఎలా ఎన్నో తలనొప్పులతో బిజీ బిజీగా గడిపిన అభ్యర్థులంతా విహార యాత్రలకు వెళ్తూ సేద తీరుతున్నారు.

ఏపీవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గంలోని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా విహార యాత్రల ప్లాన్ లోనే ఉన్నారట.

బన్నీ ఇంటికి వెళ్లిన సెలబ్రిటీలు ఆ మహిళ ఇంటికి వెళ్లగలరా.. నెటిజన్ల సూటిప్రశ్న వైరల్!