కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు..!!
TeluguStop.com
ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ముగిసినట్లు ప్రకటించిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
వ్యాక్సినేషన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఈ తరుణంలో 18 సంవత్సరాలు పైబడి వ్యాక్సిన్ వేయించుకోని వారు పబ్లిక్ ప్లేసు లలో తిరగకుండ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునే రీతిలో రాణించాలని రెడీ అవుతుంది.
వైరస్ వ్యాప్తి తగ్గటంతో చాలావరకు కరోనా కేసులు తగ్గటం తో మరోపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ వేవ్ విషయంలో గట్టిగా ఎదుర్కోవాలని.
తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
రైలులో వ్యక్తికి గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన టీటీఈ (వీడియో)