బంగారం విరాళంగా ప్ర‌క‌టించి డ‌బ్బులు మాత్ర‌మే ఇవ్వాలంటున్న తెలంగాణ ప్ర‌భుత్వం..

తెలంగాణలో ఇప్పుడు ఓ అద్భుత‌మైన ఆల‌యం గురించి చ‌ర్చ సాగుతోంది.ఎప్పుడెప్పుడా అని వేయి కండ్ల‌తో తెలంగాణ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న ఆ ఆల‌యం పూర్తి కావ‌చ్చింది.

ఇప్ప‌టికే మ‌నం దేని గురించి చ‌ర్చించుకుంటున్నామో మీకు అర్థ‌మ‌యే ఉంటుంది.అదేనండి యాదాద్రి ఆల‌యం గురించి.

ఈ ఆల‌యాన్ని సీఎం కేసీఆర్ ఎంతో జాగ్ర‌త్త‌గా నిర్మిస్తున్న సంగ‌తి తెల‌సిందే.గుడిని పునఃప్రారంభం కూడా ఈ ఎండాకాలంలోనే ఉండే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

అయితే మొన్న గుడిని మ‌రోసారి ప‌ర్య‌వేక్షించిన సీఎం కేసీఆర్ ఆలయ విమాన గోపుర నిర్మాణం కోసం ఓ నిర్ణ‌యం తీసుకున్నారు.

అదేంటంటే తిరుమలలోని తిరుప‌తి దేవ స్థానం గుడి లాగానే యాదాద్రిలో కూడా స్వర్ణ తాపడం చేయించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే ఇది నిర్మించాలంటే బంగారు తాపడానికి క‌నీసం 125 కేజీల బంగారం కావాల్సి ఉంటుంది.

మ‌రి అంత బంగారాన్ని సేక‌రించాలంటే కేవ‌లం ప్ర‌భుత్వంతో అయితే ఇబ్బంది అవుతుంద‌ని భావించిన కేసీఆర్ ఈ పుణ్య కార్యంలో ప్ర‌జ‌ల స‌హ‌కారం తీసుకోవాల‌ని భావించారు.

ఇందుకోసం బంగారాన్ని విరాళం ఇవ్వాలంటూ కోరుతున్నారు.పైగా త‌న కుటుంబం తరఫున కూడా కేజీ పదహారు తులాల వ‌ర‌కు ఇస్తామంటూ చెప్పేశారు.

"""/"/ అయితే ఇలా బంగారాన్ని విరాళం కోరే స‌మ‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఓ వినూత్న సూచన చేసింది.

అదేంటంటే గోపురానికి ఎవరైతే బంగారం ఇవ్వాల‌ని అనుకుంటున్నారో వారంతా కూడా కేజీల చొప్పున విరాళంగా ప్ర‌క‌టించి అందుకు స‌రిస‌మాన‌మైన డ‌బ్బుల‌ను మాత్రం బ్యాంకు ఖాతాలో జ‌మ చేయాలంటున్నారు.

ఇలా ఎందుకు అంటే ప్ర‌జ‌లు బంగారాన్ని ఇస్తే అందులో పూర్తిగా నాణ్యత ఉండే అవ‌కాశం ఉండ‌ద‌ని కాబ‌ట్టి డ‌బ్బులు ఇస్తే తామే వారి పేరు మీద స్వచ్ఛమైన బంగారాన్ని కొంటామ‌ని అధికారులు చెబుతున్నారు.

ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Atchennaidu : మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట