అదిగో అన్నారు ఇదిగో అన్నారు… వాయిదా వేశారంటయ్యా ? 

తెలంగాణ క్యాబినెట్ విస్తరణతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు( TPCC Chief ) నియామకంపై నిన్న రాత్రి ప్రకటన వస్తుందని ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు.

  దీనికి తగ్గట్లుగానే ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చించారు.

మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయం పైన ఒక క్లారిటీకి వచ్చారు.కొంతమంది కాబోయే మంత్రుల పేర్లు బయటకు వచ్చాయి.

అలాగే పిసిసి అధ్యక్షుడు ఎంపిక పైన ఒక క్లారిటీ వచ్చింది.కానీ అకస్మాత్తుగా మంత్రివర్గ విస్తరణతో పాటు,  పిసిసి అధ్యక్షుడు ఎంపికను వాయిదా వేస్తూ కాంగ్రెస్( Congress ) అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

అయితే నిన్న బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) నివాసంలో రాహుల్ గాంధీ , కేసి వేణుగోపాల్ ,పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షి,  సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై మంత్రివర విస్తరణ, టి.

పిసిసి అధ్యక్షుడు ఎంపిక విషయమై అంత ఆసక్తిగా చర్చించకపోవడంతో,  తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ , టి.

పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది.  ఆషాడమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో,  మంచి రోజులు లేవని , ఇక పదవుల భర్తీ శ్రావణమాసం వచ్చేవరకు ఉండకపోవచ్చు అని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

"""/" / తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్ నేతలు చాలామంది పోటీ పడుతున్నారు.

ఈ మేరకు పోటీలో ఉన్న వారంతా నిన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం బయటే ఉన్నారు.

పిసిసి అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ , బీసీ నేతలలో ఒకరికి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

కానీ ఆ వర్గాల నుంచి నలుగురు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది.ఎస్సీల నుంచి అడ్లూరి లక్ష్మణకుమార్( Adluri Laxman Kumar ) ఎస్టి నుంచి ఎంపీ బలరాం నాయక్ ,( MP Balram Naik ) బీసిల్లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ పోటీ పడుతున్నారు.

ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పదవి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పడంతో దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

"""/" / పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున తనకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ రెండు రోజుల క్రితం మల్లికార్జున ఖర్గేను కలిసి విన్నవించారు.

ఇంకా మరి కొంతమంది నేతలు ఈ పదవి పై ఆశలు పెట్టుకుని అధిష్టానం పెద్దల వద్ద తమ ను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరారు.

చివరకు ఎవరు ఊహించని విధంగా ఈ పదవుల భర్తీ వాయిదా పడింది.

పుష్పరాజ్ లాంటి వ్యక్తులు బయట కూడా ఉన్నారు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!